Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: రాష్ట్రానికి 20 వేల కేంద్ర బలగాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని రాష్ట్రానికి  20 వేల కేంద్ర బలగాలను  రప్పించనుంది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల సేవలను  ఈసీ వినియోగించనుంది.

  20K security forces to be deployed for Telangana Assembly Elections  2023 lns
Author
First Published Oct 20, 2023, 12:51 PM IST | Last Updated Oct 20, 2023, 12:51 PM IST


హైదరాబాద్:తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో  20 వేల కేంద్ర బలగాల  సిబ్బందిని సేవలను వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర పారా మిలటరీ సిబ్బంది సేవలను  వినియోగించుకోనున్నారు.  రెండు మూడు రోజుల్లో  కేంద్ర బలగాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి.

ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో  కేంద్ర బలగాల సేవలను వినియోగించుకొంటారు. మావోయిస్టు ప్రభావం ఉన్న సమయంలో కేంద్ర బలగాలను ఆ ప్రాంతాల్లో వినియోగించుకొనేవారు.  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుండి పోలింగ్ ను సక్రమంగా నిర్వహించడంతో పాటు  బ్యాలెట్ బాక్సులు లేదా ఈవీఎంలను  సురక్షితంగా కౌంటింగ్ కేంద్రానికి చేర్చడంలో  భద్రతా సిబ్బంది కీలకంగా వ్యవహరించేవారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రాబల్యం ప్రస్తుతం తగ్గింది.  2004కు ముందు  మావోయిస్టు ప్రాబల్యం ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉండేది.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే  నియోజకవర్గాల్లో కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలను మోహరించనుంది ఈసీ. రాష్ట్రంలోని భద్రతా సిబ్బందితో పాటు కేంద్రం నుండి  వచ్చే 20 వేల బలగాల సేవలను ఈసీ వినియోగించుకోనుంది.

100 కంపెనీల నుండి  20వేల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్  బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. ఒక్కో టీమ్ లో 60 నుండి 80 మంది సిబ్బంది ఉంటారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios