తల్లిదండ్రులను ఎదిరించి ఓ స్నేహితుడి సమక్షంలో పెళ్లి చేసుకున్న ఆ ప్రేమికులు మళ్లీ ఈరోజు పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితుల అందరి సమక్షంలో గురువారం ఆ జంట పెళ్లి చేసుకుంది.
ప్రేమ.. ఈ పదం ప్రస్తుతం ఎవరికీ పరిచయం చేయనక్కర్లేదు. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక దశలో ఎవరినో ఒకరిని ప్రేమిస్తారు లేదా ప్రేమించబడతారు. ప్రేమను వ్యక్తం చేసిన వారిలో కొందరు ప్రేమికులుగా మారితే.. మరి కొందరు మాత్రం వన్ సైడ్ లవర్స్ మారిపోతారు. అయితే అన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్లి విజయం సాధించలేవు. కొన్ని జంటలు మధ్యలోనే బ్రేకప్‌కు గురైతే, మరికొన్ని జంటలు తల్లిదండ్రుల ప్రోద్భలంతో బలవంతంగా విడదీయబడతాయి. ఈ రెండు ఆటంకాలు ఎదుర్కొన్న జంటలు మాత్రమే పెళ్లి పీఠలు ఎక్కి జీవితంలో ఒక్కటవుతారు. మరి ఇంతలా ప్రేమ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ? దానికి ఓ కారణం ఉంది. పాతికేళ్ల క్రితం పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న జంట.. పెద్దలందరి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకుంది.
కీచకుడి అరెస్ట్: ఇన్‌స్టాలో అమ్మాయిగా ఛాటింగ్, న్యూడ్ ఫోటోలతో .. ఏకంగా 200 మందిని
వారిద్దరిది ఒకే కాలేజ్. ఉన్నత విద్యను అభ్యసించడానికి ఓ కాలేజ్ లో చేరారు. అందులో అబ్బాయి సీనియర్ కాగా.. అమ్మాయి జూనియర్. ఒకే కాలేజ్ కావడంతో వారిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ ప్రేమను పెళ్లి పీఠలు ఎక్కించాలనుకున్నారు. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆ జంట వేరే చోటికి వెళ్లి పెళ్లి చేసుకుంది. వారం రోజుల తరువాత మళ్లీ ఊర్లోకి వచ్చింది. అనూహ్యంగా ఆ అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించారు. మళ్లీ రిసెప్షన్ నిర్వహించారు. కానీ అందరి సమక్షంలో పెళ్లి జరుపుకోలేదే అనే అంసంతృప్తి ఆ జంటలో ఇప్పటికీ ఉంది. అందుకే 25వ పెళ్లి రోజున మళ్లీ చేసుకున్నారు.
Omicron Tension : రాజన్న సిరిసిల్లా గ్రామాల్లో సెల్ఫ్ లాక్ డౌన్ (వీడియోలు)
నాగిరెడ్డిది రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే చంపాపేట్ ప్రాంతం. 25 ఏళ్ల క్రితం లా చదివేందుకు పీఆర్ఆర్ కాలేజ్ లో చేరారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో కొత్త బ్యాచ్ ఆ కాలేజీకి వచ్చింది. అందులో ఒకరు సంస్కృత. ఆమెది వరంగల్. కాలేజీలో చదివే సమయంలో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్ని రోజుల తరువాత ప్రేమగా మారింది. పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉందామనకున్నారు. కానీ సంస్కృత వాళ్ల ఇంట్లో ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. దీని కోసం ఒడిశాలోని ఓ ఫ్రెండ్ సాయం తీసుకున్నాడు. అక్కడికి వెళ్లి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల తరువాత ఈ పెళ్లి విసయం రెండు కుటుంబాలకు తెలియజేశారు.
ఈ విషయం తెలిసిన రెండు కుటుంబాలు తరువాత ఈ పెళ్లిని అంగీకరించాయి. దీంతో కొత్త జంట చాలా సంతోషించింది. హైదరాబాద్ కు వచ్చిన తరువాత రెండు కుటుంబాల సమక్షంలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తల్లిండ్రులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకోలేదే అనే అసంతృప్తి ఆ జంటను వెంటాడుతూనే ఉంది. దీనికి పరిష్కారంగా మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. దీని కోసం బ్రహ్మణులను సంప్రదించారు. మళ్లీ 25 ఏళ్ల తరువాతే పెళ్లి చేసుకోవచ్చని తెలిపారు. దీంతో వాళ్లు ఈ పాతికేళ్ల వరకు ఎదురు చూశారు. ఇప్పుడు ఆ జంటకు ఇద్దరు పిల్లలు. ఈ రోజుతో ఆ జంట ఒక్కటై 25 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో ముందే అనుకున్నట్టుగా పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలనుకున్నారు. ఈ సారి తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను అందరినీ పిలిచి వేద పండితుల సాక్షిగా గురువారం రోజు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి చూడలేకపోయామనే బాధ ఇరు కుటుంబాల బాధ ఈరోజుతో తీరిపోయింది.
