Omicron Tension : రాజన్న సిరిసిల్లా గ్రామాల్లో సెల్ఫ్ లాక్ డౌన్ (వీడియోలు)

గ్రామంలోని ప్రజలు బయటకు వెళ్లవద్దని, బయటివారు గూడెం కు రావద్దని నిర్ణయం తీసుకున్నారు. ఒమిక్రాన్ బారిన పడిన వ్యక్తి బాధితుడు ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపుర్ లో ఓ శుభకార్యంలో పాల్గొనడంతో, ఆ కార్యక్రమంలో పాల్గొన్న 53 మంది నమూనాలు సేకరించి, వారిని ఇళ్ళు నుండి బయటకు రావద్దని వైద్యాధికారులు ఆదేశించారు.

Self lockdown in Rajanna Sirisilla villages over Omicron Tension

సిరిసిల్ల : Rajanna Sirisilla జిల్లా, ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో సెల్ఫ్ లాక్ డౌన్ మొదలయ్యింది. ఇటీవల దుబాయ్ నుండి తన స్వంత గ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తికి ఓమిక్రాన్ నిర్దారణ కాగా, తాజాగా అతని తల్లి, భార్యలకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.  దీంతో గ్రామంలో 10 రోజుల పాటు స్వయంగా లాక్ డౌన్ విధించుకున్నారు. 

"

గ్రామంలోని ప్రజలు బయటకు వెళ్లవద్దని, బయటివారు గూడెం కు రావద్దని నిర్ణయం తీసుకున్నారు. ఒమిక్రాన్ బారిన పడిన వ్యక్తి బాధితుడు ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపుర్ లో ఓ శుభకార్యంలో పాల్గొనడంతో, ఆ కార్యక్రమంలో పాల్గొన్న 53 మంది నమూనాలు సేకరించి, వారిని ఇళ్ళు నుండి బయటకు రావద్దని వైద్యాధికారులు ఆదేశించారు.

కాగా, తెలంగాణలో రోజురోజుకు Omicron cases పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే Rajanna Sirisilla, ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గల్ఫ్ నుండి వచ్చిన వ్యక్తికి మూడు రోజుల క్రితం ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ అయ్యింది. కాగా అతని కుటుంబ సభ్యులతో పాటు మరో 64 షాంపిల్లను వైద్యాధికారులు సేకరించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి తల్లికి, భార్యకు కోవిడ్ పాజిటివ్ రాగా గ్రామాన్ని పదిరోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ చేస్తున్నట్లు పంచాయితీ తీర్మానం చేసింది. 

వివరాల్లోకి వెడితే గూడెం గ్రామానికి చెందిన 26 ఏళ్ల వ్యక్తి ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. ఈ నెల 16న అతడు తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అయితే అతడు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలోకి చేరుకున్నాక అధికారులు ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించారు. సోమవారం అతనికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా తేలింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారులు సోమవారం సమాచారం అందింది. 

దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌రావుతో పాటు పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సంజీవరెడ్డి.. ఇతర వైద్య సిబ్బంది వెంటనే గూడెం గ్రామానికి చేరుకున్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని వెంటనే వైద్య సేవల కోసం హైదరాబాద్‌లోకి KIMS Hospitalకి తరలించారు. 

సిరిసిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు వైద్యాధికారులు.. ఒమిక్రాన్‌ కట్టడికి చర్యలు చేపట్టారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఇంటికి చేరాక ఎవరెవరిని కలిశారో ఆరా తీశారు. మొదట ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరుగురిని, అతన్ని కలిసిన మరో ఏడుగురిని క్వారంటైన్‌ చేశారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తితో పాటుగా దుబాయ్ నుంచి వచ్చిన చిప్పలపల్లికి చెందిన మరో వ్యక్తి ఇంటిని కూడా క్వారంటైన్‌ చేశారు. గూడెం గ్రామ ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. ఇక, తాజా కేసుతో కలిపి తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios