ప్రేమికుల రోజు పేరుతో ఫిబ్రవరి 14వ తేదీన యూత్ అంతా ఉత్సాహంగా జరుపుకుంటారు. వాలంటైన్స్ డే పేరుతో జరిగే ఈ హడావిడి ప్రపంచమంతా జరుగుతున్నది. అయితే కర్మభూమి అయిన భారత దేశంలో ఈ పిచ్చి పండుగలు జరుపుకోరాదని హిందూ ధార్మిక సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. గత కొంతకాలంగా విహెచ్ పి, బజరంగ్ దళ్, శివసేన లాంటి హిందూత్వ సంస్థలు వాలంటైన్స్ డే ను వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాలంటైన్స్ డే జరుపుకోవడంలో తప్పేం లేదని సోషల్ మీడియాలో ఒక అమ్మాయి వీడియో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ప్రేమికులంతా తెగ షేర్ చేస్తున్నారు.

ప్రేమికుల రోజున ప్రేమికులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించే వారికి ఈ అమ్మాయి పెట్టిన వీడియో చెంప పెట్టు అని యూత్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. శైలు కటారి అనే అమ్మాయి ఫేస్ బుక్ లో నిత్యం లైవ్ ద్వారా తాజా అంశాలపై అప్ డేట్ సమాచారం ఇస్తూ గత కొంలకాలంగా హాట్ టాపిక్ గా మారారు. ఆమె వీడియోలను జనాలు లక్షల్లో చూస్తున్నారు. ఆమె లైవ్ లో ఉందంటే.. వేలసంఖ్యలో లైవ్ చూస్తారు. పవన్ కళ్యాణ్, కత్తి మహేష్ వివాదంపై ఈ అమ్మాయి ఇచ్చిన లైవ్ లకు భారీ స్పందన వచ్చింది. ఇప్పుడు ప్రేమికుల రోజు వ్యతిరేకులపై ఆమె ఏం మాట్లాడిందో ఈ వీడియోలో చూడండి.