రైతును రాజును చేయకపోయినా ఫర్వాలేదు... రాజద్రోహం కేసులు పెట్టి వారిని హింసించకండి... కనీసం ఈ ఫొటో చూసైనా కాస్త స్పందించండి... తండ్రి చెంతకు చేరాలనుకుంటున్న ఆ చిన్నారి వేదనను కాస్త అర్థం చేసుకోండి.

చూశారా..... ఈ చిన్నారిని...

తన చేయిపట్టుకొని నడిపించిన నాన్న చేతులకు సంకెళ్లు వేయడం చూసి ఎలా తల్లడిల్లుతున్నాడో...

తల్లి సాయంతో కన్నతండ్రి స్పర్శ కోసం ఎలా పరితపిస్తున్నాడో...

ఇంతకీ ఈ చిన్నారి ఎవరు...?

సంకెళ్లు వేసి పోలీసులు వాహనాల్లో తరలిస్తున్న అతడి నాన్న ఎవరు...?

కష్ట పడి సాగు చేసిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాక ఆవేదనతో మార్కెట్ యార్డును తగలబెట్టిన ఖమ్మం రైతన్నలో ఈ నాన్న ఒకరు.

అంతమాత్రాన... ఈ అన్నదాత ఏదో దేశద్రోహం చేసినట్లు, ఉగ్రవాదాన్ని ప్రేరిపించినట్లు రాజద్రోహం కేసులు పెట్టి జైలుకు తరలించారు. బేడీలు వేసి కోర్టు మెట్లు ఎక్కించారు.

అలా కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్తున్న సమయంలో ఈ దృశ్యం ఓ కెమెరా కంటికి చిక్కింది.

నాన్న మళ్లీ కనిపించరేమోనని ఆ చిన్నారి తల్లి సహాయంతో ఇలా తండ్రి దగ్గరికి చేరబోయాడు. ఇంకేముంది క్షణం ఆలస్యం కాకుండా పోలీసు వాహనం అక్కడి నుంచి దూసుకెళ్లింది.

ఆ చిన్నారి వేదనను అర్థం చేసుకోలేనంత దూరంగా వెళ్లిపోయింది.

కేసీఆర్ సర్.... మీరు రైతును రాజును చేయకపోయినా ఫర్వాలేదు... రాజద్రోహం కేసులు పెట్టి వారిని హింసించకండి... కనీసం ఈ ఫొటో చూసైనా కాస్త స్పందించండి... తండ్రి చెంతకు చేరాలనుకుంటున్న ఆ చిన్నారి వేదనను కాస్త అర్థం చేసుకోండి. అన్నదాతలను ఇప్పటికైనా వదిలేయండి.