Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ కోరిక మరీ అంత చిన్నదేనా ?

  • రెడ్డి హాస్టల్ వేడుకల్లో కెసిఆర్ కోరిక
  • ఎడ్యుకేషన్ టవర్ తీసుకురావాలని కోరిన కేసిఆర్
  • సభికుల కోరికలు వెంటనే తీర్చిన కెసిఆర్
This is kcrs small desire

తెలంగాణ సిఎం కెసిఆర్ ఈమధ్య ఏ సభలో పాల్గొన్నా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కోరికలు కోరుతుంటారు. ఆయా సమావేశాల్లో జనాల కోరికలు తెలుసుకోవడం అక్కడికక్కడే తీరుస్తానంటూ హామీలు ఇవ్వడం జరుగుతున్నది. దాంతోపాటే మీ కోరికలు తీర్చాను కాబట్టి నాకూ ఒక కోరిక ఉంది అది మీరు తీర్చాలి అంటూ సభికులను కోరుతుంటారు. గతంలో మీ కోరికలు తీర్చిన కాబట్టి నాకు యాట కూర తోటి పెద్ద దావత్ ఇయ్యాలె అంటూ సదరగా వ్యాఖ్యానించారు కెసిఆర్. అయితే అనేక సందర్భాల్లో ఆ కోరికలు తీరలేదు. కేసిఆర్ కోరికను జనాలు కూడా తీర్చలేదు.

ఇక రెడ్డి హాస్టల్ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా జరిగిన సభలో ముందుగా మాట్లాడిన నాయిని నర్సింహ్మారెడ్డి ఒక కోరిక కోరారు. రెడ్డి హాస్టల్ కు పది ఎకరాలతోపాటు మరో ఐదెకరాలు ఇయ్యాలి అన్నారు. అలాగే ఐపిఎం భూమి నుంచి 1500 గజాలు కావాలని మరో కోరికను రెడ్డి హాస్టల్ నిర్వాహకులు అడిగారు.

దీంతో సిఎం మాట్లాడుతూ నాయిని నర్సన్న మాట అంటే మాటే. ఆయన మాట అంటే నాకు ఆర్డర్ వేసినట్లే అంటూ నాయిని కోరికను వెంటనే తీరుస్తాను. రేపు సాయంత్రం వరకు మరో ఐదెకరాలు ఇస్తూ ఉత్తర్వులు ఇస్తామన్నారు. అలాగే ఐపిఎం జాగాలోంచి 1500 గజాలు ఇవ్వాలంటూ వేదిక మీదున్న వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ఆదేశించారు కెసిఆర్.

ఇక తన కోరికేంటో వెల్లడించారు కెసిఆర్. ఈ రెడ్డి హాస్టల్ లో గొప్ప ఎడ్యుకేషన్ టవర్ రావాలి. దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థగా ఇది ఎదగాలి. బికాం బిఎ లాంటి వానాకాలం చదువులు కాకుండా కొత్త కోర్సులు పెట్టి వెంకటరామారెడ్డి పేరు చిర స్థాయిగా నిలిచేలా చేయాలి. అప్పుడే ఆయన ఆశిస్సులు కూడా మనకు స్వర్గం నుంచి అందుతాయి అన్నారు. ఇలా తన కోరికను వెల్లడించారు కెసిఆర్. మొత్తానికి రెడ్డి హాస్టల్ నిర్వాహకులకు పెద్ద పనే పెట్టేశారు సిఎం కెసిఆర్.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios