తెలంగాణ ప్రజలకు కేసిఆర్ మరో గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజలకు కేసిఆర్ మరో గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజలకు సిఎం కేసిఆర్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని పథకాలు ప్రవేశపెడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపేదల ఇంట్లో ఆడపిల్ల పెండ్లి బరువు కావొద్దన్న ఉద్దేశంతో కేసిఆర్ సర్కారు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు రూపకల్పణ చేసింది. బిపిఎల్ కుటుంబాలన్నింటికీ ఈ పథకం వర్తింపజేస్తున్నది సర్కారు.

ఇప్పటి వరకు ఈ పథకం కింద 75వేల రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ పథకం ప్రారంభించినప్పుడు 51వేలు ఉండేది. కానీ దాన్ని ఇటీవల 75, 116కు పెంచారు. తాజాగా మరోసారి ఆ 75,116 రూపాయల నజరానా ను 1,00,116కు పెంచారు. ఈ మేరకు పెంపు నిర్ణయాన్ని సెంబ్లీలో సిఎం కేసిఆర్ ప్రకటన చేశారు.  ఈ పథకం కింద ఇప్పటి వరకు 3 లక్షల 65వేల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో ఆడపిల్ల పెండ్లి చేయడమంటే గుండెలమీద కుంపటిలా భావించే తల్లిదండ్రులకు ఈ పథకం వరం కానుందని సిఎం ప్రకటించారు.

దీంతోపాటు ఈ పథకం 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకే వర్తింపజేస్తున్నట్లు కేసిఆర్ ప్రకటించారు. తద్వారా బాల్య వివాహాలను సైతం శాశ్వతంగా నిర్మూలించే చాన్స్ ఉందన్నారు. బాల్య వివాహాలు ఎక్కువగా పేదరికం ఉన్నచోటే జరిగే అశకాశాలుంటాయని, అలాంటప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం వల్ల ఆ బాల్య వివాహాలు ఆగిపోయి 18 ఏళ్ల వరకు తల్లిదండ్రులు ఆగే వెసులుబాటు ఉంటందన్నారు. పరిపాలనలో అడుగడుగునా మానవీయ విలువలు ప్రతిబింబించాలని భావించి.. పేద ఆడపిల్లల పెళ్లికి ఆర్థికంగా అండదండగా నిలువాలని కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టామన్నారు. ఈ పథకం వ్యక్తిగతంగా తన హృదయానికి దగ్గరైన పథకం అని చెప్పారు కేసిఆర్.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos