Asianet News TeluguAsianet News Telugu

విక్రం కేసులో జరిగింది ఇదే

  • విక్రం గౌడ్ కాల్పుల కేసులో ఎ1 విక్రం గౌడే
  • వివరాలు బయట పెట్టిన సిటి సిపి మహేందర్ రెడ్డి
  • విక్రం ఆసుప్రతి నుంచి డిచ్చార్జి కాగానే అరెస్టు
  • ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశాం
  • మొత్తం 9 మంది ఈ టాస్క్ లో నిందితులు
This is how vikram goud was hurt in the stage managed firing

సంచలనం సృష్టించిన విక్రం గౌడ్ కాల్పుల కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో 9 మంది నిందితులుగా గుర్తించారు పోలీసులు. అందులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. విక్రం ఆసుప్రతి నుంచి డిచ్చార్జి కాగానే అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు. విక్రం గౌడ్ తన నియోజకవర్గంలో సానుభూతి పెంచుకునేందుకు, బాకీదారులను స్మూత్ గా సెటిల్ చేసునేందుకు కాల్పుల డ్రామాకు తెర లేపినట్లు సిపి చెప్పారు. ఈఘటనపై సిటి సిపి మహేందర్ రెడ్డి వెల్లడించిన వివరాలివి.

This is how vikram goud was hurt in the stage managed firing

ఈ కేసులో

 ఎ 1 విక్రం గౌడ్

ఎ 2 నందకుమార్

ఎ 3 అహ్మద్ ఖాన్

ఎ 4 రహిజ్ ఖాన్

ఎ 5 బాబూజాన్

ఎ 6 గోవింద రెడ్డి లను పోలీసులు గుర్తించారు. వీరిలో విక్రం ఆసుపత్రి నుంచి డిచ్చార్జి కాగానే రిమాండ్ కు తరలిస్తామని ఇప్పటికి మిగిలిన ఐదుగురు తమ కస్టడీలో ఉన్నారని చెప్పారు సిపి. వీరితోపాటు మరో ముగ్గురు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు సిపి చెప్పారు.

 

ఇలా జరిగింది ఈ వ్యవహారం

నాలుగు నెలల క్రితం ఏప్రిల్ లోనే విక్రం గౌడ్ ఈ దుష్ట పన్నాగానికి తెర తీశాడు. తనకు తానుగా హింసించుకుంటే నియోజకరవర్గంలో సానుభూతి వస్తుందని భావించాడు. అలాగే తనకు భాకీలు ఇచ్చిన వారికి తక్కువ మొత్తాలు చెల్లించి వారితో సెటిల్ చేసుకోవచ్చని తలంచాడు. దీంతో విక్రం ఈ టాస్క్ చేయాల్సిందేనని కంకణం కట్టుకున్నాడు. దీనికోసం ఎలా చేయాలి? ఎం చేయాలన్నదానిని ఆయనే స్వయంగా ప్లాన్ చేశాడు.

ముందుగా కడప జిల్లాకు చెందిన ప్రసాద్ ను దీనిగురించి కాంటాక్ట్ చేశాడు విక్రం. కానీ ఆయనకు ఈ విషయం చెప్పలేదు. తర్వాత ప్రసాద్ కడప జిల్లాకే చెందిన గోవిందరెడ్డిని విక్రం కు పరిచయం చేశాడు. విక్రం తన టాస్క్ ను గోవింద రెడ్డికి వివరించాడు. దీన్ని చేయడానికి అంగీకరించడంతో 5లక్షలు రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు విక్రం. టాస్క్ పూర్తయిన తర్వాత 50 లక్షలు ఇస్తానని చెప్పాడు విక్రం.

 

ఈ క్రమంలో ఈ టాస్క్ పూర్తి చేయడం కోసం నంద కుమార్ అనే వ్యక్తిని కాంట్రాక్టు చేశాడు గోవింద రెడ్డి. నందకుమార్ అనే వ్యక్తి అనంతపురం జిల్లా వాడు. అప్పుడప్పుడు పులివెందుల వెళ్లి వచ్చేవాడు నందకుమార్. నందకుమార్ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి. 7 కేసుల్లో ఆయనకు ప్రమేయం ఉంది. దీంతో నందకుమార్ ఎలాగైనా ఈ టాస్క్ చేయగలడని విక్రం నమ్మకం పెట్టుకున్నాడు. విక్రం కు టాస్క్ చేస్తానని నందకుమార్ బరోసా ఇచ్చాడు. ఆ సమయంలో గోవింద రెడ్డి తన వద్ద ఉన్న 5లక్షలలో మూడున్నర లక్షలు నందకుమార్ కు చెల్లించాడు. ఆయుధం కొనుగోలు కోసం ఇవివాడుకోవాలని నిర్ణయించుకున్నారు.

తర్వాత కదిరిలో ఉన్న షేక్ అహ్మద్, బాబూ జాన్ లను కాంటాక్ట్ చేశాడు నందకుమార్. ఈ డీల్ కు వారు సరే అన్నారు. ఖదీర్ అనే వ్యక్తి చికెన్ షాపు నడుపుతాడు. అతడికి రహీజ్ అనే చికెన్ షాపు నడిపే వ్యక్తి దోస్తు. రహీద్ ఇండోర్ లో ఉండేవాడు. ఆయనకు ఖదీర్ కు దోస్తాన్ ఉంది. గతంలో ఒకసారి ఆయుధాలు కావాలంటే చెప్పు. తక్కువ ధరకు అందిస్తామంటూ రహీజ్ చెప్పిన విషయం ఖదీర్ కు గర్తొచ్చింది. దీంతో వెపన్ కోసం రహీజ్ ను కాంటాక్ట్ చేశారు.

ఇండోర్ వస్తే వెపన్ ఇప్పిస్తానని రహీజ్ చెప్పాడు. ఆ సమయంలో రంజాన్ మాసం కావడంతో ఒక నెల వరకు వాయిదా వేసుకున్నారు. రంజాన్ తర్వాత జులై 6న షేక్ అహ్మద్, బాబూజాన్, వెంకట రమణ అలియాస్ చిన్నా వీరు ముగ్గురు కలిసి ఇండిగో ఫ్లైట్ లో వయా ముంబై ఇండోర్ వెళ్లారు. 7వ తేదీన తిరిగి వచ్చారు. ఆ సమయంలో చిన్నా బస్ లో వచ్చాడు ఆయుధం కొనుగోలు చేసి. 30వేలు రహీజ్ కు అందజేశారు. వెపన్ ను వెంకటరమణ, రహీజ్ బంధువు జావెద్ ఇద్దరూ కలిసి హైదరాబాద్ తరలించారు బస్సులో.

8వ తేదీన ఉదయం బాలానగర్ లో ఆ ఆయుధాన్ని తీసుకున్నాడు విక్రం గౌడ్. తన ఇంట్లో భద్రపరిచాడు విక్రం.

విక్రం గౌడ్ కు వివరిస్తూ ఉన్నాడు. చిన్నా దగ్గర నుంచి నందకుమార్ విక్రం వెళ్లారు. విక్రం వెపన్ తీసుకుని ఇంట్లో భద్రపరిచా డు.

వెంటనే టాస్క్ చేయాలని నందకుమార్ అండ్ టీం ను విక్రం వత్తిడి చేస్తూ  ఉన్నాడు. ఈ క్రమంలో నందకుమార్ తన బంధువు పుట్టపర్తి ఆసుపత్రిలో ఉన్నాడని వెళ్తానని చెప్పడంతో లక్షన్నర రూపాయలు, తన ఓక్స్ వ్యాగన్ కారు ఇచ్చి పంపించాడు విక్రం గౌడ్. తర్వాత చాలాకాలం పాటు నంద అక్కడి నుంచి రాలేదు. దీంతో విక్రం ఆందోళ చెంది నందను వేధించాడు. నీకు చేతకాదా? నువ్వు గాజులు వేసుకున్నావా అని అసభ్య పదజాలంతో దూషించాడు. అయినా నందకుమార్ రాకపోవడంతో విక్రం పుట్టపర్తి వెళ్లాడు. అక్కడ నందను కలిసి వెంటనే రమ్మని చెప్పి తన కారును తన వెంట తెచ్చుకున్నాడు. విక్రం వత్తిడితో నందకుమార్ హైదరాబాద్ వచ్చాడు.

జులై 21న నందకుమార్, చిన్నా, బాబూజాన్, షేక్ అహ్మద్ అందరూ విక్రం ఇంట్లో కలిశారు. డ్రాయింగ్ రూంలోనే ప్లాన్ వేశారు.

ఒకడు ఫైర్ చేయాలి. ఇంకొకడు మోటార్ బైక్ పై రెడీగా ఉండాలి. ఫైరింగ్ అనంతరం అప్పటికే స్టార్ట్ అయిన బైక్ మీద కూర్చొని వెళ్లిపోవాలి. అని నిర్ణయించుకున్నారు.

23న మోటార్ బైక్ తీసుకురావడానికి ప్లాన్ చేశారు. గోవింద రెడ్డి 30వేలు పెట్టి బైక్ కొనుగోలు చేశాడు. షేక్ అహ్మద్ హైదరాబాద్ కి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత సికింద్రాబాద్ లోని రాయల్ లాడ్జిలో దిగారు.

బాబూజాన్ కు చాంద్రాయనగుట్టలో గౌస్ అనే ఫ్రెండ్ ఉంటాడు. అక్కడికి 26న వెళ్లి బైక్ ఇంజిన్ నెంబరు, చాసిస్ నెంబరు తొలగించారు. దానిలో గౌస్ పాత్ర ఉంది.

వాళ్లు టాస్క్ చేయడానికి ఈజీగా ఉండేందుకు సికింద్రాబాద్ లో కంటే అపోలో ఆసుప్రతి దగ్గరలో పేషెంట్ గెస్టు హౌస్ లో ఒక రూమ్ బుక్ చేసి వీళ్లను అక్కడికి షిప్ట్ చేశాడు విక్రం.

విక్ర గౌడ్ పేరు మీదే ఆ రూమును హైర్ చేసిండు అనేది సాక్స్యాలు దొరికాయి.

25 తెల్లవారుజామున టాస్క్ జరగాల్సి ఉన్నా మూడున్నరకు నందా, గౌస్, బాబూజాన్ ముగ్గురూ విక్రం ఇంటికి వెళ్లారు. బైక్ తీసుకురావాల్సిన షేక్ జాన్ టైం కు తీసుకురాలేదు. దీంతో వాయిదా పడింది.

జులై 26 న ఈ టాస్క్ చేయలేమంటూ గోవింద రెడ్డి వెనక్కు వెళ్లిపోయాడు. నంద గోపాల్, చిన్న కదిరి వెళ్లిపోయారు.

వెపన్ ఉపయోగించడంలో ఎవరికీ అనుభవం లేకపోవడంతో షేక్ అహ్మద్ ఒక ప్లాన్ చేశాడు. ఇండోర్ రహీజ్ ను పిలిచి టాస్క్ చేయిస్తే బాగుంటుందని అన్నాడు. దీనికి విక్రం ఓకె అన్నాడు. రహీజ్ అంగీకరించాడు. బస్సులో బయలుదేరి 27న ఉదయం ఇమ్లిబన్ బస్టాండ్ లో దిగాడు. షేక్ అహ్మద్ పికప్ చేసుకున్నాడు. సన్మాన్ హోటల్ లో దిగాడు. రహీజ్.

మళ్లీ కదిరి నుంచి నందకుమార్ హైదరాబాద్ వచ్చాడు. 27 రాత్రి 10న్నరకు వచ్చాడు. అపోలో ఆసుపత్రి గెస్టు హౌస్ కు వచ్చాడు. అందరూ అక్కడికి వచ్చారు. విక్రంతో సహా.

నంద, సేక్ అహ్మద్, రహీజ్ ఉన్నారు. ఆపరేషన్ లో వీరు ముగ్గురే ఉన్నారు.

28 తెల్లవారుజామున విక్రం వీళ్లు ముగ్గురిని కారులో కూర్చోబెట్టుకుని ఇంటివద్దకు వచ్చి రెక్కీ చేశారు.

వెపన్ ఎక్కడ పారేయాలన్నది కూడా విక్రం చెప్పాడు. హకీంపేట కుంటలో పారేయాలని చెప్పాడు విక్రం.

తర్వాత పైకి వెళ్లి వెపన్ తో పాటు డబ్బు తీసుకుని వచ్చాడు విక్రం. అందులో నందగోపాల్ కు నాలుగు లక్షలు, రహీజ్ కు రెండు, షేక్ అహ్మద్ కు రెండు లక్షలు ఇచ్చాడు. జాగ్రత్తగా కాల్చాలని, టాస్క్ సక్సెస్ అయితే మరో 50 లక్షలు ఇస్తానని చెప్పాడు విక్రం. ఒకవేళ తన ప్రాణాలకు ముప్పు  ఏర్పడితే ఆ డబ్బు మీకు రాదు కాబట్టి జాగ్రత్తగా కాల్చాలంటూ చెప్పాడు విక్రం.

తర్వాత మళ్లీ పైకి వెళ్లి భార్యను లేపి స్నానం చేసి రెడీగా ఉండాలని చెప్పాడు.

ఆ సమయంలో నంద తన కారును భారతీయ విద్యాభవన్ వద్ద పార్కు చేసుకుని పెట్టుకున్నాడు.

రహీజ్ ఇంటిలో ఉన్నాడు. షేక్ అహ్మద్ రెడీ టూ మూవ్ పొజిషన్ లో బయట బండిపై ఉన్నాడు.

మొదటి రౌండ్ చేతి మీద కరెక్టుగానే ఫైర్ చేశాడు. రెండో రౌండ్ మిస్ అయి పొట్టలోకి బుల్లెట్ దూసుకుపోయింది.

మూడో రౌండ్ ఫైర్ చేసే సమయంలో వెపన్ స్ట్రక్ అయింది. తర్వాత వెంటనే రహీజ్, షేక్ అహ్మద్ బైక్ మీద వెళ్లిపోయారు. తర్వాత నంద కారులో వెళ్లిపోయాడు. అనంతరం కేకలు, భార్య భయపడి ఆసుపత్రికి తీసుకెళ్లడం అవన్నీ జరిగినాయి.

ఈ కేసులో విక్రం 50 లక్షలకు డీల్ కుదిరించుకున్నాడు. మొత్తం 14 లక్షలు చెల్లించాడు. ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడన్న సామెతను తలపించేలా ఉంది విక్రం గౌడ్ నిర్వాకం. మొత్తానికి విక్రం ఆసుప్రతి నుంచి డిచ్చార్జి కాగానే రిమాండ్ కు వెళ్లి జైలులో ఊసలు లెక్కించే పరిస్థితి చేజేతులా తెచ్చుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios