నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోర్టు ఇచ్చిన తీర్పులో ఉరి శిక్షను విధించడం హాజీపూర్ కేసు మూడోది. గతంలో రెండు కేసుల్లో దోషులకు ఉరిశిక్షను విధించారు. హాజీపూర్ కేసులో శ్రీనివాస్ రెడ్డికి  ఉరి శిక్ష విధించడంతో  నల్గొండ కోర్టులో ఉరిశిక్షలు విధించిన కేసులు మూడుకు చేరుకొన్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలిసారిగా 1964లో తొలిసారిగా ఓ కేసులో దోషికి ఉరిశిక్షను విధిస్తూ కోర్టు  తీర్పును చెప్పింది. ఆ తర్వాత  1987లో కూడ మరో కేసులో కూడ దోషికి ఉరి శిక్షను విధించారు.

 ఆ తర్వాత  హాజీపూర్ కేసులో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో  మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్షను విధిస్తూ నల్గొండ కోర్టు గురువారంనాడు తీర్పు చెప్పింది. 

Also read:హజీపూర్ సీరియల్ రేపిస్ట్, కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష

1964లో దోషికి మరణశిక్షను అమలు చేశారు. 1987లో నల్గొండ కోర్టు విధించిన తీర్పును దోషి హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. అయితే హైకోర్టులో ఈ  తీర్పు అమలు కాకుండా తీర్పు రావడంతో  ఉరి శిక్ష అమలు కాలేదు. ఇక హాజీపూర్ సీరియల్ రేపిస్టు, కిల్లర్  మర్రి శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ కోర్టు  ఉరిశిక్షను విధించింది.

ఈ కేసులో దోషి శ్రీనివాస్ రెడ్డికి హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడ ఉంది. అయితే దోషి శ్రీనివాస్ రెడ్డికి  ఉరిశిక్షను వెంటనే అమలు చేయాలని  హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.