Asianet News TeluguAsianet News Telugu

దొంగ భార్య అరెస్ట్.. మా పాపకు ఫిట్స్.. ఆమెకేమైనా అయితే ఎవరు చూసుకోవాలి’ అంటూ పోలీసులతో భర్త వాగ్వాదం..

పోలీసులు ఇద్దరు దొంగలు సుధాకర్, ఆయూబ్ తో పాటు సుధాకర్ భార్యను కూడా అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. మాన్వవల్ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసి చాకచక్యంగా దొంగలను పట్టుకున్న సిబ్బందిని సీపీ అభినందించారు. అయితే తన భార్యను కూడా అరెస్ట్ చేశారన్న విషయం విని సుధాకర్ కోపానికి వచ్చాడు.

thief conflict with cp press meet in hyderabad over wife arrested in a theft case
Author
Hyderabad, First Published Dec 20, 2021, 11:12 AM IST

హైదరాబాద్ :  వయస్సు 27 ఏళ్లు… ఇప్పటికే 59 Thefts చేశాడు. రెండు సార్లు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అయినా బుద్ది మార్చుకోలేదు. ఇటీవలే jail నుంచి బయటకు వచ్చిన ఎనిమిది రోజులకే 70 తులాల gold చోరీ చేశాడు. పోలీసులు సదరు ఘరానా దొంగ, అతని భార్యతో పాటు మరో దొంగను అరెస్ట్ చేశారు. వారి నుంచి 41తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

సీపీ అంజనీ కుమార్, జాయింట్ సీపీ విశ్వప్రసాద్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. Kurnool District కండేలికి చెందిన గుంజపాగు సుధాకర్ అలియాస్‌ సాయి అలియాస్‌ ఆంధోనీ, అలియాస్‌ కాకా, అలియాస్‌ డేంజర్ కొన్నేళ్ల క్రితం బ్రతుకుతెరువు కోసం నగరానికి వచ్చాడు. మెహిదీపట్నంలో ఉంటూ Auto driverగా పని చేసేవాడు. దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా ఎంచుకున్నాడు.

120 చోరీల దొంగతో జైల్లో జతకట్టాడు…
జైల్లో సుధాకర్ కు చేవెళ్లకు చెందిన మరో ఘరానా దొంగ మహమ్మద్ ఆయూబ్ అలియాస్  బడా  ఆయూబ్ తో  జైల్లోనే పరిచయం అయింది.  ఆయూబ్ అప్పటికే 125 చేసిన ఘనుడు. ఇద్దరు ఈ ఏడాది అక్టోబర్ 13న జైలు నుంచి విడుదలయ్యారు. అక్టోబర్ 21న తెల్లవారుజామున 2 గంటలకు గగన్ మహల్ స్వామి నిలయం అపార్ట్మెంట్ పక్కింటి గోడ దూకి అపార్ట్మెంట్ లోకి చొరబడి.. 70 తులాల బంగారం చోరీ చేశారు.

ఖమ్మంలో విషాదం... సాగర్ కాలువలో కొట్టుకుపోయిన ముగ్గురు కేరళవాసులు

అల్మారాలో మరో బ్యాగులో ఉంచిన 30 తులాల బంగారాన్ని చూడలేదు. దాన్ని వదిలేసి వెళ్లారు. చోరీ సొత్తును సుధాకర్ తన భార్య నాగమణి అలియాస్ నాగవేణి అలియాస్ బుజ్జి అలియాస్ చిట్టితల్లికి ఇచ్చాడు. ఆమె కొంత సొత్తును ముంబైకి చెందిన మహ్మద్ తబ్రేజ్‌దౌడ్‌ షేక్‌ సహకారంతో అమ్మేసి సొమ్ము చేసుకుంది.

దాంతో పోలీసులు ఇద్దరు దొంగలు సుధాకర్, ఆయూబ్ తో పాటు సుధాకర్ భార్యను కూడా అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. మాన్వవల్ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసి చాకచక్యంగా దొంగలను పట్టుకున్న సిబ్బందిని సీపీ అభినందించారు. అయితే తన భార్యను కూడా అరెస్ట్ చేశారన్న విషయం విని సుధాకర్ కోపానికి వచ్చాడు.

పోలీసులతో దొంగ వాగ్వాదం 
ప్రెస్మీట్లో సిపి చోరీ జరిగిన తీరుతో పాటు.. నిందితుల వివరాలు వెల్లడిస్తుండగా.. పక్కనే అదుపులో ఉన్న నిందితుడు సుధాకర్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ‘దొంగతనం చేసింది నేను.. నన్ను ఏమైనా చేసుకోండి. అవసరమైతే చంపేసుకోండి. అంతేగాని నా భార్య పేరు ఎందుకు తెస్తున్నారు. ఆమెను ఎందుకు ఇందులోకి లాగుతున్నారు. దొంగతనంతో ఆమెకు ఏం సంబంధం’ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో పోలీసులు అతని పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లారు.  ‘మా పాపకు ఫిట్స్ (మూర్ఛ) ఉంది. ఏమైనా అయితే ఎవరు చూసుకోవాలి’ అంటూ  పోలీసులతో వాదించినట్టు తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios