బరితెగించి ఆ ఇద్దరు మొగుళ్లు ఏం చేశారో తెలుసా

these husbands exchanged secret bedroom lives with each other through skype
Highlights

వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే చెప్పలేదు మన పెద్దలు. బుద్ధి తక్కువ పనులు చేసే వారికి తగిన శాస్తి జరగడం ఖాయం. ఈ సామెతను నేటి కాలంలోనూ నిజం చేశారు ఆ ఇద్దరు మొగుళ్లు. వారు చేసిన పనితో మానవ సమాజం తలదించుకునేలా ఉంది. ఇంతకీ వారేం చేశారంటే

మేడ్చల్ జిల్లా శామీర్ పేటకు చెందిన ఆకుల క్రిష్ణ చైతన్య డిజిటల్ మార్కెటింగ్ లో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం కర్నూలుకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అప్పట నుంచి అతడు ఆమెను వేధిస్తూ ఉన్నాడు. చిత్రహింసలకు గురిచేస్తూ, సూటిపోటి మాటలతో వేధింపులకు గురిచేస్తున్నడు.

 

అంతటితో ఆగకుండా ప్రమాదకరమైన వికృత క్రీడకు తెర తీశాడు. అతడికి చైన్నై కి చెందిన శ్రీమాన్ అనే వ్యక్తితో ఆన్ లైన్ లో ఇటీవల పరియం ఏర్పడింది. దీంతో వారిద్దరూ ఒక అవగాహనకు వచ్చారు. ఒకరి శృంగారం చేసే దృశ్యాలను ఇంకొకరికి స్కైప్ ద్వారా షేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

 

దీంతో వెంటనే కృష్ణ చైతన్య రంగంలోకి దిగాడు. తన భార్య బాత్రూమ్ లో స్నానం చేస్తున్న దృష్యాలు, పడక గది సీన్లను వీడియో తీశాడు. కొన్నింటిని దీపక్ కు షేర్ చేశాడు. దీపక్ సైతం తన వీడియోలనుకృష్ణ చైతన్యకు షేర్ చేస్తున్నాడు. ఈ తతంగం గత  పది రోజులుగా సాగుతున్నది.

 

గత నాలుగు రోజుల క్రితం కృష్ణ చైతన్యపై తన భార్యకు అనుమానం రావడంతో అతడి ల్యాప్ టాప్, ఫోన్లు పరిశీలించింది. దీంతో తన భర్త చేసిన అరాచకాలు చూసి నిర్ఘాంతపోయింది. వెంటనే కుటుంబసభ్యులతో కలిసి సైబరాబాద్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

భార్య ఫిర్యాదు మేరకు కృష్ణ చైనత్యను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో ఉన్న దీపక్ ను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

loader