కూకట్‌పల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ప్రచారానికి గడువు ముగుస్తుండటంతో నిరాశలో కూరుకుపోయారు. నందమూరి సుహాసినికి మద్ధతుగా జూనియర్ ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ ప్రచారం లేనట్లేనని స్పష్టమైన సంకేతాలు కనిపించడంతో అభిమానులు నీరుగారిపోయారు.

ప్రచారానికి ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు సాయంత్రం 5 గంటలతో ముగుస్తుండటంతో పాటు నేటి ప్రచార షెడ్యూల్‌లో ఎక్కడా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేర్లు కనిపించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ ప్రచారంపై ఆశలు వదిలేసుకున్నారు.

సినిమా షూటింగులలో అన్నదమ్ములిద్దరూ తీరిక లేకుండా ఉండటంతో ప్రచారానికి రాలేకపోతున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కూకట్‌పల్లి నుంచి నందమూరి ఆడపడుచు సుహాసినీ పోటీ చేస్తుండటంతో ఆమెకు మద్ధతుగా నందమూరి కుటుంబం మొత్తం ప్రచారానికి సిద్ధమైంది.

టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, తారకరత్నతో పాటు దివంగత నందమూరి జానకీరామ్ భార్య, హీరో తారకరత్న ప్రచారం చేశారు. ఆమె గెలుపుకోసం ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం రంగంలోకి దిగడంతో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ‌తప్పకుండా వస్తారని అందరూ భావించారు.

సుహాసినికి మద్దతు తెలియజేస్తూ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇప్పటికే ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే ప్రచారంలో పాల్గొనాలనుకుంటే ముందే ఎన్నికల కమిషన్ కు లేఖ పెట్టి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఇప్పటి వరకు ఆ ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. దీంతో ఎన్టీఆర్ సుహాసిని ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పచ్చ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి. 

జోరుగా బెట్టింగ్: సుహాసిని కూకట్ పల్లి సీటు హాట్ కేక్

రాజకీయనాయకుల్లా మాట్లాడటం చేతకాదు.. సుహాసిని

సుహాసినికి ప్రచారం: మరో ఐదు రోజులు హైదరాబాదులో చంద్రబాబు

సుహాసినికి మద్దతుగా..ప్రచారం చేసిన కళ్యాణ్ రామ్ భార్య

నందమూరి సుహాసినికి షాక్...ప్రచారానికి రానన్న భువనేశ్వరి

సుహాసిని కోసం ఎన్నికల ప్రచారానికి ఏపీ మంత్రి సునీత

నందమూరి సుహాసిని తలుపుతట్టిన అదృష్టం...ఎలా అంటే