కర్ణాటక కంటే తెలంగాణలోనే అవినీతి ఎక్కువ.. సీఎం కేసీఆర్ సర్కారుపై కాంగ్రెస్ ఫైర్

Hyderabad: కర్ణాటక కంటే తెలంగాణలోనే ఎక్కువ అవినీతి కొన‌సాగుతోంద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బీఆర్ఎస్ పాల‌న అవినీతిలో కూడుకుపోయింద‌ని విమ‌ర్శించింది. గత తొమ్మిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్టులు మాత్రమే దక్కించుకుని తెలంగాణ ప్రజల సంపదను దోచుకుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు.

There is more corruption in Telangana than in Karnataka; Congress hits out at KCR government RMA

Telangana Congress: కర్ణాటక ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పినట్లే రాష్ట్ర ప్రజలు కూడా త్వ‌ర‌లోనే తెలంగాణ అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) కు త‌గిన గుణపాఠం చెబుతారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ హయాంలో జరిగిన అవినీతి కంటే తెలంగాణలో చాలా ఎక్కువ అవినీతి జరుగుతోంద‌ని ఆరోపించారు.

వార్తా సంస్థ ఏఎన్ఐతో మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. “గత తొమ్మిదేళ్లలో, కేసీఆర్ ప్రభుత్వం కేవలం కాంట్రాక్టులు సంపాదించి తెలంగాణ ప్రజల సంపదను దోచుకుంది. కర్ణాటకలో అవినీతి బీజేపీని ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఇచ్చారు. అవినీతి ప్రభుత్వాలను ప్రజలు సహించరని ఇప్పుడు అర్థమైంది. తెలంగాణ‌లో కూడా ఇదే జ‌రుగుతుంది" అని అన్నారు. ‘‘కర్ణాటకలో జరిగిన అవినీతి కంటే తెలంగాణలో చాలా ఎక్కువ అవినీతి జరిగింది. కాబట్టి, తెలంగాణ ప్రజల నుండి ఇక్కడ కూడా అదే ఫలితాలను మేము ఆశిస్తున్నాము” అని తెలిపారు. “రాహుల్ గాంధీ వరంగల్‌లో రైతుల కోసం ప్రకటన చేయగా, ప్రియాంక గాంధీ యువత కోసం కాంగ్రెస్ డిక్ల‌రేష్ ప్ర‌క‌టించి.. దానికి కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా ఉపాధి, నీరు, సాగుకు సంబంధించి ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ ఏర్పడింది. కానీ ప్రజలకు మేలు చేసే హామీలో కేసీఆర్ విఫలమయ్యారు. 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 35 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు" అంటూ విమ‌ర్శించారు. 

అలాగే, “రాబోయే ఐదేళ్లలో 3.5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయిస్తామ‌ని పేర్కొంది. ఆరోగ్య శ్రీ కింద రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమా రక్షణ కూడా అందించబడుతుంది. మేము 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న విద్యార్థులకు ఎలక్ట్రిక్ బైక్‌లను అందిస్తామ‌ని కూడా వాగ్దానం చేసామని" తెలిపారు. "రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు బలోపేతం చేయాలని నిర్ణయించాం. జూన్ పూర్త‌య్యే నాటికి అన్ని బూత్‌లు, మండలాలు, జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తాం. జూన్ 16 నాటికి మేము మా సంస్థాగత నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని" వెల్ల‌డించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios