మేనమామ వల్ల తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని ఓ వ్యక్తి దారుణానికి ఒడి గట్టాడు. అతడిని హత్య చేసి.. శవాన్ని రైల్వైట్రాక్స్ పక్కన పడేశాడు.
పెద్దపల్లి : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మేనమామ భిక్షాటన చేస్తుండడంతో... తనకు పెళ్లి కావడం లేదన్న కారణంతో మేనమామను హత్య చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని రైల్వేట్రాక్ పక్కన పడేశాడు ఓ యువకుడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో నిందితులను పట్టుకున్నాడు.కేసు వివరాలను డీసీపీ పెద్దపల్లి వైభవ్ గైక్వాడ్ మంగళవారం వెల్లడించారు. . ఈ నెల 4న పెదపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. ట్రాక్‌కు కొద్ది దూరంలో మృతదేహం పడి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదవశాత్తూ రైలు నుంచి పడిపోయినా, దూకినా మృతదేహం ట్రాక్‌కు 100 అడుగుల దూరంలో ఉండడం అసాధ్యమని భావించిన పోలీసులు స్టేషన్‌కు వెళ్లే మార్గంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.
అందులో అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఆటో కనిపించింది. అలాగే సెంటినరీ కాలనీలోని సీసీటీవీ ఫుటేజీలో అదే ఆటో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మంగళవారం పెదపల్లి బస్టాండ్ సమీపంలో ఎస్సై రాజేష్ వాహనాలు తనిఖీ చేస్తుండగా అదే ఆటోను చూసి డ్రైవర్ ఆందోళన చెంది పోలీసులను చూడగానే అనుమానాస్పదంగా వ్యవహరించాడు. అతడిని విచారించగా ఘటన వెలుగులోకి వచ్చింది. రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన చిప్పగుర్తి శివ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతని మేనమామ మారుపాక రాయమల్లు (50) స్థానికంగా చెప్పులు కుట్టేవాడు, భిక్షాటన చేసేవాడు. అయితే శివ పెళ్లి చేసుకోలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు : 9న ఢిల్లీకి రావాలని కవితకు ఈడి సమన్లు
తన మామ భిక్షాటన చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని భావించిన శివ అతన్ని చంపాలని ప్లాన్ చేస్తాడు. ఈ నెల 3న సెంటినరీ కాలనీలో రాయమల్లుపై దాడి చేసి ఆటోలో పెదపల్లికి తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసి ఉండడంతో సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి రాయమల్లు తలపైనా, శరీరంపై ఇతర భాగాలపై కర్రతో తీవ్రంగా కొట్టడంతో చనిపోయాడు. అనంతరం శివ మృతదేహాన్ని ట్రాక్ పక్కన పడేసి వెళ్లిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత హత్యగా గుర్తించి నిందితుడు శివను అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఏసీపీ మహేష్, సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ ఉన్నారు
