సినీ నటుడు ఎన్టీఆర్.. శుక్రవారం తన భార్య, తల్లితో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు సంగతి పక్కన పెడితే..ఎన్టీఆర్, నందమూరి అభిమానుల్లో మరో సరికొత్త అనుమానం మొదలైంది. ఎన్టీఆర్ లుక్ అంత కొత్తగా ఏమీ లేదు కదా..? ఎన్నికల ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నారంటూ.. పలువురు సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలుపెట్టేశారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని టీడీపీ అభ్యర్థిగా కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమెకు మద్దతుగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని అంతా భావించారు. అయితే.. ఎన్టీఆర్ మాత్రం ప్రచారంలో పాల్గొనలేదు. అయితే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన తాజా చిత్రంలో ఎన్టీఆర్ లుక్ భిన్నంగా ఉంటుందని.. ప్రచారానికి వస్తే.. లుక్ బయటపడిపోతుందనే కారణంతో ప్రచారానికి రాలేదనే ప్రచారం మొదలైంది.

అదే కారణం కావచ్చులే.. అందుకే ప్రచారానికి రాలేదని అందరూ భావించారు. కానీ.. శుక్రవారం ఓటు వేయడానికి వచ్చిన ఎన్టీఆర్ ని చూసి అందరూ షాకయ్యారు. ఎందుకంటే.. ఆయన లుక్ భిన్నంగా ఏమీలేదు. నార్మల్ గానే ఉన్నాడు. కాకపోతే కాస్త గడ్డం ఎక్కువగా పెంచి కనపడ్డారంతే. నిజంగా సినిమా లుక్ బయటపడుతుంది అనుకుంటే..ఓటు వేయడానికి కూడా రాకుండా ఉండేవారు కదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. దీనిని బట్టి.. ప్రచారానికి రాకపోవడానికి కారణం సినిమా కాదు.. మరేదో ఉండే ఉంటుందని పలువురు భావిస్తున్నారు. 

read more news

సుహాసిని తరపున..ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడానికి కారణం ఇదే..

నందమూరి సుహాసిని కోసం ఓట్ల కొనుగోలు: ముగ్గురి అరెస్టు

జోరుగా బెట్టింగ్: సుహాసిని కూకట్ పల్లి సీటు హాట్ కేక్