మహాకూటమి తరపున కూకట్ పల్లి అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలోకి దిగారు నందమూరి సుహాసిని. ఆమె కోసం ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఏపీ మంత్రి పరిటాల సునీత తదితరులంతా ప్రచారం నిర్వహించారు. అయితే.. ఆమె సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మాత్రం ఎన్నికల ప్రచారంలో  పాల్గొనలేదు.

ఆమె టీడీపీ అభ్యర్థిగా కూకట్ పల్లి అభ్యర్థిగా నామినేషన్ వేయగానే.. సోదరులు ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపారు. తమ సోదరిని గెలిపించండి అంటూ కోరారు కూడా. ప్రచారంలో కూడా పాల్గొంటారని అందరూ భావించారు. కానీ వారు మాత్రం పాల్గొనలేదు. దీనిపై సోషల్ మీడయాలో పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి.

తాజాగా మరో వాదన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రచారానికి రావాలని ఎన్టీఆర్ భావించినప్పటికీ.. రాజమౌళి పెట్టిన కండిషన్ కారణంగా రాలేకపోయారట. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ డిఫరెంట్ గా ఉంటుందట. ప్రచారానికి వెళితే లుక్ బయటపడిపోతుందన్న కారణంతో ప్రచారానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  

read more news

నందమూరి సుహాసిని కోసం ఓట్ల కొనుగోలు: ముగ్గురి అరెస్టు

జోరుగా బెట్టింగ్: సుహాసిని కూకట్ పల్లి సీటు హాట్ కేక్