బ్యాంకును మోసం చేసి, 14 సంవత్సరాలుగా పోలీసులకు చిక్కుకుండా జీవిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ అధికారులు వారిని హైదరాబాద్ లో ఆదివారం అరెస్టు చేశారు.

తప్పుడు రికార్డులు తయారు చేసి బ్యాంకునే మోసం చేసి, కోట్ల రూపాయిలను కొల్లగొట్టిన ఇద్దరు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ 14 ఏళ్ల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులకు చిక్కకుండా గుట్టుగా జీవిస్తున్నారు. అయితే పెండింగ్ కేసులపై ఫొకస్ పెట్టిన సీఐడీ అధికారులు.. తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్‌ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

విమానంలో వృత్తి ధర్మం చాటుకున్న డాక్టర్లు.. ప్రాణాపాయస్థితిలో ఉన్న చిన్నారికి గాలిలోనే వైద్యం.. చివరికి

వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్‌పల్లిలో ఉన్న కన్యకాపరమేశ్వరీ కోఆపరేటివ్‌ బ్యాంక్ లో పని చేసే ఉద్యోగులు, డైరెక్టర్లు కలిసి కోట్ల రూపాయిల మోసానికి పాల్పడ్డారని 2009లో సీఐడీకి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును లిక్విడేటర్ గా ఉన్న అన్నపూర్ణ ఆ ఏడాది అక్టోబర్ 1వ తేదీన అందించారు. డైరెక్టర్లు, ఉద్యోగులు కలిసి 2.86 కోట్ల మోసం చేశారని పేర్కొన్నారు. వాటిని చిన్న మొత్తాల పొదుపుదారులకు లోన్లు ఇచ్చినట్టు తప్పుడు పత్రాలు సృష్టించారని తెలిపారు. తరువాత వాటిని తమ సొంత అకౌంట్లలోకి మళ్లించుకున్నట్టు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.

ఇద్దరు బాలురపై ఆరుగురు క్లాస్ మేట్స్ లైంగిక దాడి.. స్కూల్ క్యాంప్ లో అఘాయిత్యం..

ఈ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో 2015 సంవత్సరంలో అభియోగపత్రం కూడా నమోదు చేసింది. అయితే ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్న కాకర్లపూడి కృష్ణవర్మ, కాకర్లపూడి పద్మ లు పోలీసులకు చిక్కలేదు. అప్పటి నుంచి వారు పోలీసులకు దొరక్కుండా, గుట్టుగా ఎక్కడో జీవిస్తున్నారు.

ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని.. కూతురును వ్యాపారవేత్తకు అమ్మేసిన తల్లి.. కుమారుడిని కూడా..

అయితే ఇటీవల సీఐడీ పెండింగ్ కేసులపై ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ఈ కేసులో నిందితులను గాలించేందుకు ఏసీపీ గంగాధర్ నేతృత్వంలో స్పెషల్ టీం ఏర్పాటు అయ్యింది. నిందితులు ఇద్దరూ విశాఖపట్నంలో జీవిస్తున్నారని తెలుసుకున్నారు. సిద్దార్థనగర్ లోని ఓ ఇంట్లో ఉంటున్నారని కనిబెట్టారు. వీరి మూమెంట్స్ పై దృష్టి ఉంచారు. ఈ క్రమంలో నిందితులు హైదరాబాద్ కు వచ్చారు. దీంతో వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.