తెలంగాణా అధికార పార్టీలో, ప్రతిపక్షాలలో చర్చంతా ఈయన మీదే. కాంగ్రెస్ ఆయన్ని కవ్విస్తుంది. టిఆర్ఎస్ వూరిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక  కన్నేసి ఉంచాల్సిన నాయకుడుయ్యారు తన్నీరు హరీష్ రావు. హరీష్ రావు అంటే అర్థమేమిటి?

మళ్లీ వార్తలెకెక్కిన హరీష్ రావు

తెలంగాణా పాలిటిక్స్ లో ఒక కన్నేసి ఉంచాల్సిన యువనాయకుడు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు.

తెలంగాణా ఉద్యమంలో పుట్టి, ఉద్యమంతో పాటే పెరిగిన రెండో మెట్టు నాయకులలో హరీష్ రావు పేరును మొదటి చెప్పుకోవాలి. హరీష్ రావుకు కష్టపడటం తెలుసు,జనాలను ఆకట్టు కోవడం తెలుసు, ఉద్యమంలో మమేకమై పెరిగాడు కాబట్టి, ఉద్యమంలో పాల్గొన్న ప్రతిమనిషికి హరీష్ రావు హరీషన్న అయ్యాడు. అందుకే కెసి ఆర్ వారసుడెవరూ అన్నపుడ వినపడే పేర్లలో హరీష్ రావు పేరుటుంది. అంఅటూ రూలింగ్ టిఆర్ ఎస్ లో ఒకందుకు, ప్రతిపక్ష పార్టీలలో మరొకందుకు హరీష్ రావు ఎపుడూ చర్చనీయాంశమవుతుంటాడు.

 హరీష్ రావు నిన్న మళ్లీ చర్చనీయాంశమయ్యాడు. ఈ సారి చర్చ మొదలుపెట్టిందెవరో కాదు, తర్వాతి ముఖ్యమంత్రి అని పేరుబడిన ఐటి, మునిసిపల్ మంత్రి కెటి రామారావు. హరీష్ గురించి నిన్న జరిగిన జగిత్యాల టిఆర్ఎస్ సభలో కెటి రామారావు బావ హరీష్ గురించి చెప్పిన విషయాలు చాలా రాజకీయప్రాధాన్యం ఉన్న విషయాలు. వాటిని అంతగా తీసేయడానికి వీల్లేదు.

 కెటిఆర్ ఏమన్నాడో చూడండి.

‘ హరీష్ కు నాకు ఎలాంటి గ్యాప్ లేదు. మామధ్య మంచి అవగాహన ఉంది. హరీష్ ఇంటర్వ్యూ, నా జనహిత సభలు యాధృచ్ఛికమే. హరీష్ కాంగ్రెస్ లోకి వెళ్లడు. సిద్ధిపేటలో త్వరలో పెద్ద బహిరంగ సభ పెడతాం.అది రామన్న, హరీషన్న సభ అవుతుంది.’

 హరీష్ కాంగ్రెస్ లోకి వెళ్లడని వివరణ ఇవ్వాల్సిన అవసరమేమిటి?

పాఠకులు దీనిని అర్థంచేసుకోలేనంత అమాయకులు కాదు. ఇది టిఆర్ ఎస్ బయట జరగుతున్న చర్చకు సమాధానమే. కెసిఆర్ వారసుడెవరనే చర్చ వస్తే, హరీష్ రావు కూడా చేయెత్తుతాడని ఒక వాదన ఉంది. అపుడు కాంగ్రెస్ మద్ధతిస్తుందని కొందరు, లేదు ఆయనకు కాంగ్రెస్ తలుపులు బార్లా తెరుస్తుందని ఇంకొందరు చెబుతున్నారు. దీనికి కెటిఆర్ జివాబిచ్చినట్లు లేదూ...

 ఒక వైపు కెటిఆర్ లాంటి వ్యక్తి హరీష్ రావు కాంగ్రెస్ లోకి వెళ్లడని చెబుతూ ఉంటే ఏమనుకోవాలి.

ఇక కాంగ్రెస్ ఎమంటున్నదో చూడండి.

తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకో , జాప్యం చేస్తే అవకాశం మళ్లీరాదు అని కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు కు పిలుపు ఇస్తున్నారు.

నిన్న ధర్నా చౌక్ పరిరక్షణ ధర్నా సందర్భంగా అరెస్టయినపుడు మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఈ పిలుపు ఇలా ఇచ్చారు. ఆయనతో మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా ఉన్నారు.

‘కెసిఆర్ కొడుకును ముఖ్యమంత్రిని చేయాల‌నుకుంటుండూ.. హ‌రీష్ రావూ, స‌మ‌యం లేదు.మీ మామ‌కు వెన్ను పోటు పొడువు. నీకు మా మ‌ద్ద‌తుంట‌ది నీవు సిఎం ప‌ద‌వి చేపట్టాలి,’ ఇదిసర్వే పిలుపు.