చిన్నారి లోపలే ఉందని గుర్తించక ఆయా అంగన్ వాడీ సెంటర్ కు తాళం వేసింది. దీంతో సుమారు 6 గంటల పాటు మూడేళ్ల చిన్నారి నరకయాతనకు గురైంది. గ్రామస్తులు అంగన్ వాడీ సెంటర్ తాళం తీయించడంతో పాప బయటకు వచ్చింది.
అంగన్ వాడీ సిబ్బంది నిర్లక్ష్యం ఓ పాపను నరకయాతన అనుభవించేలా చేసింది. భవనం లోపల బాలిక ఉందని గుర్తించకుండా ఆయా తాళం వేసి వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ అందులోనే ఉండిపోయింది. ఇలా దాదాపు 6 గంటల పాటు అందులోనే భయం భయంగా గడిపింది. ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పింది. చివరికి తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చి అంగన్ వాడీ తాళం తీయడంతో బాలిక సురక్షితంగా బయటపడింది.
మెడికో ప్రీతిది హత్యే: విచారణ తీరుపై సోదరుడు వంశీ అనుమానాలు
ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లిలో చోటు చేసుకుంది. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాజీపల్లిలో వడ్డె మల్లప్ప, విజయలక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు కూతుర్లు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. చిన్న కుమార్తె అయిన అవంతికకు మూడేళ్ల ఉన్నాయి. దీంతో ఆమె కూడా అక్కలతో కలిసి స్కూల్ ఆవరణలో ఉన్న అంగన్ వాడీ సెంటర్ లోకి వెళ్తోంది.
నేడు హైదరాబాద్‌లో టి-వర్క్స్ ఆవిష్కరణ.. దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్..
ఎప్పటిలాగే మంగళవారం కూడా అవంతిక తన అక్కలతో కలిసి స్కూల్ కు బయలుదేరి అక్కడే ఉన్న అంగన్ వాడీ సెంటర్ కు వెళ్లింది. ఇతర పిల్లలతో కలిసి కూర్చుంది. అయితే మధ్యాహ్నం సమయంలో అంగన్ వాడీ టీచర్ తనకు అనారోగ్యంగా ఉందని ఇంటికి వెళ్లిపోయారు. కొంత సమయం అంగన్ వాడీ సెంటర్ లో పని చేసే ఆయా పిల్లలు అందరూ వెళ్లిపోయారా లేరా అనే విసయాన్ని గమనించుకోకుండా సెంటర్ కు తాళం వేసింది. తరువాత ఇంటికి వెళ్లిపోయింది.
సాయంత్రం 6 గంటల సమయంలో తల్లిదండ్రులు పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి వద్ద చిన్న కూతురు వారికి కనిపించలేదు. దీంతో సమీపంలో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను చూశారు. ఎంత వెతికినా తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
వృద్ధురాలిపై వీధికుక్క దాడి.. ముక్కు కొరకడంతో తీవ్రగాయాలు..
ఈ విషయం గ్రామ పెద్దలకు వరకు చేరింది. స్థానిక సర్పంచ్ అంగన్ వాడీ సెంటర్ వద్దకు వెళ్లి, తాళం తీయాలని సిబ్బందిని ఆదేశించారు. అప్పుడు సమయంలో రాత్రి 8.45 అవుతోంది. తాళం తీసి లోపలికి వెళ్లిన గ్రామస్తులు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. చిన్నారి అవంతిక స్టోర్ రూమ్ లో స్పృహ తప్పి పడిపోయి కనిపించింది. వెంటనే స్థానికులు ఆమెను బయటకు తీసుకొచ్చి సపర్యలు చేశారు. దీంతో ఆమె కోలుకుంది. బుధవారం ఐసీడీఎస్ అధికారులు అంగన్ వాడీ సెంటర్ ను పరిశీలించారు. టీచర్, ఆయాకు నోటీసులు అందజేశారు.
