Asianet News TeluguAsianet News Telugu

మెడికో ప్రీతిది హత్యే: విచారణ తీరుపై సోదరుడు వంశీ అనుమానాలు

మెడికో ప్రీతిది ఆత్మహత్య కాదని  హత్యని  ఆమె సోదరుడు వంశీ ఆరోపించారు.   పోలీసుల ఎవరినో  కాపాడే ప్రయత్నం  చేస్తున్నారని  ఆయన అనుమానాలు వ్యక్తం  చేశారు. 

Medico  Preethi  Brother  Vamsi  Suspects on  Police Remand Report
Author
First Published Mar 2, 2023, 9:35 AM IST


వరంగల్:  మెడికో ప్రీతిది  హత్యేనని  సోదరుడు వంశీ ఆరోపిస్తున్నారు. తన సోదరి ఆత్మహత్య  చేసుకొనేంత  పిరికిది కాదని  ఆయన  చెబుతున్నారు.మెడికో ప్రీతి సోదరుడు వంశీ   ఈ విషయమై  మీడియాతో మాట్లాడారు  మెడికో  సైఫ్  రిమాండ్  రిపోర్టులో  కూడా తప్పులున్నాయని  ఆయన ఆరోపించారు. 

సైఫ్  పై  ఫిర్యాదు  చేసినందుకు  హెచ్ఓడీ  ప్రీతినే తిట్టాడని వంశీ ఆరోపించారు.  మరో వైపు  సైఫ్, పై  ఫిర్యాదు చేసిన  ప్రీతికి కౌన్సిలింగ్  ఇచ్చినట్టుగా  చెబుతున్న విషయమై  కూడా వంశీ స్పందించారు.  కౌన్సిలింగ్  విసయమై   తమ కుటుంబ సభ్యులు  కేఎంసీ  యాజమాన్యంతో సంప్రదింపులు  జరిపిన విషయాన్ని వంశీ  ప్రస్తావించారు.

 పోలీసులు  ఎవరినో  కాపాడేందుకు  ప్రయత్నిస్తున్నారని వంశీ ఆరోపించారు.  తన సోదరికి  రెస్ట్ లేకుండా  డ్యూటీలు వేయాలని  సైఫ్  ఆదేశించినట్టుగా  వార్తలను తాను  చూసినట్టుగా  చెప్పారు. రెస్ట్ లేకుండా డ్యూటీలు వేసిన  వారిపై  ఏం చర్యలు తీసుకున్నారో  చెప్పాలని ఆయన  ప్రశ్నించారు.  యాంటీ ర్యాగింగ్ కమిటీలో  ఉన్న హెచ్ఓడీ నాగార్జున  పెద్ద చీటర్ అని  ఆయన  ఆరోపించారు.  

మెడికో ప్రీతి   చేతిపై  కట్  చేసినట్టుగా  తాము గుర్తించినట్టుగా  వంశీ  చెప్పారు. మరో వైపు ప్రీతి కడుపుపై  శస్త్రచికిత్స  చేసినట్టుగా  తమకు  అనుమానం ఉందన్నారు.   మెడికో ప్రీతి కి  అందించిన  రక్తం  బయట నుండి  వచ్చిందని  వంశీ  చెప్పారు.. మెడికో ప్రీతి  ఆత్మహత్య చేసుకుందని  ఎలాంటి ఆధారాలున్నాయని ఆయన  ప్రశ్నించారు. తన అక్క  ప్రీతిని చంపారని  ఆయన ఆరోపించారు.  ఎంజీఎం నుండి  నిమ్స్ కు తరలించే సమయంలోనే  ప్రీతి  శరీరం నుండి వాసన వచ్చిందన్నారు. 

also read:డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్‌కి నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్ట్ అనుమతి

గత నెల  22  వ తేదీన  మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం  చేసింది.  వెంటనే ఆమెకు వరంగల్ ఎంజీఎంలో  చికిత్స నిర్వహించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం  నిమ్స్ కు తరలించారు.  నిమ్స్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  ఆమె మృతి చెందింది.  

మెడికో ప్రీతిని  సీనియర్  సైఫ్  వేధించినట్టుగా  పోలీసులు గుర్తించారు.  ఈ విషయమై  ప్రీతి , సైఫ్  సహ ఇతరుల  వాట్సాప్  చాటింగ్ లను  గుర్తించినట్టుగా  వరంగల్ పోలీసులు  ప్రకటించారు. 

మెడికో ప్రీతి  ఆత్మహత్యకు  కారణమైన   వారిని కఠినంగా శిక్షిస్తామని  ప్రభుత్వం ప్రకటించింది.  ఈ కేసులో  అరెస్టైన సీనియర్ సైఫ్  ను కస్టడీకి ఇచ్చేందుకు  కోర్టు అంగీకరించింది.  నాలుగు రోజలపటు  సైఫ్ ను  పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. గత నెల  24వ తేదీన  సైఫ్ ను పోలీసులు అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios