విలేకరుల సమావేశంలో రియల్ ఎస్టేట్ కష్టాలుప్రస్తావించిన ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామీణ రైతు నోట్ల కష్టాల గురించి మాట్లాడనే లేదు
తెలంగాణ ముఖ్యమంత్రి సోమవారంనాడు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం, బహుశా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత మొట్టమొదటిది. అయితే, ఇందులో చాలా విషయాలు ప్రస్తావించారు. సమస్యల చాలా క్లారిటి ఇచ్చారు. అయితే, అత్యంత కీలకమయిన విషయం ఒక ప్రస్తావించకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తుంది. ఆయన మర్చిపోయిన మనిషి- తెలంగాణా రైతు.
మంత్రుల సమావేశం కూడా ఇది మొదటిది అనుకుంటా. ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధానితో దాదాపు గంటకు పైగా నోట్ల సమస్య గురించి అనేక విషయాలు చర్చించి, అనేక సలహాలందించి వచ్చారు. ప్రధానితో ఏమిచర్చించారన్నదాన్ని కాంగ్రెస్ రభస చేసింది. ఆయనేదో డీల్ కుదుర్చుకునేందుకు వెళ్లారని, ప్రధాని- ముఖ్యమంత్రి చర్చల్లో దొర్లిన అంశాలను వెల్లడించాలని కూడా పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత క్యాబినెట్ చర్చించిన విషయాతో పాటు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్ల ప్రధానితో తాను చర్చించిన విషయాలను కూడా వెల్లడించారు.
ఎన్ని విషయాలను, ఎంత వివరంగా చర్చించినా నోట్ల సమస్యను ఎదుర్కొనేందుకు ఏమి చేయాలనే దాని మీద ప్రభుత్వం దగ్గిర ఒక స్ఫష్టమయిన ప్రణాళిక లేదని పిస్తుంది.
ఆశ్చర్యంగా, పెద్ద నోట్ల రద్దు ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం మీద పడుతుందని ఆయన అంగీకరించారు. దాని వల్ల ఎంతనష్టమో వివరించారు. బేల్దారు కూలి వాడి దగ్గిర నుంచి , ఇసుక, ఇటుక సరఫరా చేసే వ్యాపారం మీద అధార పడిన వారంతా ఎలా నష్టపోతారో చాలా వివరాం చెప్పారు. అయితే, వ్యవసాయ రంగం గురించి, రైతుల మీద, ఆహార ఉత్పత్తి మీద, రైతు కూలీల సమస్యలను ముఖ్యమంత్రి అసలు ప్రస్తావించక పోవడం ఆశ్చర్యం.
గ్రామీణ తెలంగాణ ఈ నోట్ల సంక్షోభం నుంచి ఏ విధంగా బయటకు రావాలో, తెలంగాణ ప్రభుత్వం దీని కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా శెలవిచ్చి ఉంటే బాగుండేది.
రిజిస్ట్రేషన్ మరియు ఎక్సైజ్ శాఖలు ఆన్లైన్ పద్ధతిలో పని చేస్తాయని అని ప్రకటించారు. పూర్తిగా, నగదు రహిత సమాజం భారత దేశంలో సాధ్యం కాదు అని ఆంగీకరిస్తూ సిద్ధిపేట ను మోడల్ నగదు రహిత నియోజకవర్గంగా తీర్చుతామని చెప్పారు.
ఇంకా అనేక నియోజకవర్గాలు ఈ దారిలోకి తీసుకువస్తామని ప్రకటించారు.ప్రజలు కోరితే ప్రతి మూడు నాలుగు గ్రామాలకు 'అవసరమైతే', వాళ్ళు అడిగితే ఎటిఎం లు పెడతారట. కొన్ని లక్షల గ్రామాలలో ఎటిఎం రూమ్ లు కట్టడానికి ఇది గొప్ప అవకాశం.
