Asianet News TeluguAsianet News Telugu

బిడ్డలను గొంతు కోసి చంపిన భ‌ర్త‌.. అతడిని అలాగే చంపి పగ తీర్చుకున్న భార్య‌.. ఎక్క‌డంటే ?

బిడ్డలను దారుణంగా చంపేసిన భర్తపై భార్య పగ తీర్చుకుంది. హాస్పిటల్ కు వెళ్లి చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన అతడిని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో హతమార్చింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. 

The husband who strangled the children.. the wife who took revenge by killing him as well.. where is it?
Author
First Published Sep 19, 2022, 2:09 PM IST

తండ్రి బిడ్డ‌ల ప‌ట్ల క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించాడు. భార్యపై అనుమానంతో సొంత బిడ్డ‌ల‌నే క‌డ‌తేర్చాడు. అనంత‌రం అత‌డూ ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించాడు. కానీ తృటిలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. హాస్పిట‌ల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయి ఇంటికి వ‌చ్చాడు. అప్ప‌టికే బిడ్డ‌ల‌ను కోల్పోయిన బాధ‌లో ఉన్న ఆ త‌ల్లికి భ‌ర్త‌ను చూసిన వెంట‌నే కోపం వ‌చ్చింది. భ‌ర్త నిద్ర‌పోతున్న స‌మ‌యంలో అత‌డిని దారుణం హ‌త్య చేసి ప‌గ తీర్చుకుంది. 

ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కుడికిళ్ల గ్రామంలో 38 ఏళ్ల ఓంకార్, 35 ఏళ్ల మ‌హేశ్వ‌రీలు దంప‌తులు. కొన్నేళ్ల కింద‌ట వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఏడాది వ‌య‌స్సున్న కుమారుడు విశ్వ‌నాథ్, మూడేళ్ల వ‌య‌స్సున్న కూతురు చంద‌న ఉన్నారు. అయితే కొంత కాలం నుంచి ఓంకార్ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింది. ఆ బిడ్డ‌ల‌ను త‌నకు పుట్టిన పిల్ల‌లు కార‌ని అంటూ అనుమానం వ్య‌క్తం చేస్తున్నాడు. భార్యను నిత్యం వేధింపుల‌కు గురి చేస్తున్నాడు.

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. ఐటీ కంపెనీలు, బిల్డర్ల ఇళ్లలో కొనసాగుతున్న తనిఖీలు!

మూడో బిడ్డ కావాలంటూ భార్య‌పై భ‌ర్త వేధిస్తున్నాడు. దీనికి ఆమె ఒప్పుకోక‌పోవ‌డంతో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో గ‌త నెల 17వ తేదీన హాస్పిట‌ల్ లో ట్రీట్ మెంట్ ఇప్పిస్తాన‌ని న‌మ్మించి భార్య, బిడ్డ‌ల‌ను తీసుకొని టూ వీల‌ర్ పై బ‌య‌లుదేరాడు. ఎత్తం ప్రాంతానికి చేరుకున్నాక భార్య‌ను టూ వీల‌ర్ పై నుంచి ప‌డ‌గొట్టాడు. కొంత దూరంలో ఉన్న గట్టు వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. బిడ్డ‌ల గొంతు కోశాడు. అనంత‌రం అత‌డూ గొంతు కోసుకున్నాడు. 

అయితే కొంత స‌మ‌యంలో త‌రువాత తేరుకున్న మ‌హేశ్వ‌రీ వెంట‌నే పోలీసు స్టేష‌న్ కు బ‌య‌లుదేరింది. త‌న బిడ్డలను భ‌ర్త తీసుకెళ్లాడ‌ని, అంత‌కు ముందు చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను వారికి వివ‌రించింది. భ‌ర్త‌పై ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. పిల్ల‌ల ఆచూకీ కోసం గాలించారు. ఆ స‌మ‌యంలో గాయాల‌తో ప‌డి ఉన్న ఓంకార్ పోలీసుల‌కు క‌నిపించాడు. పిల్ల‌లు ఎక్క‌డ ఉన్నార‌ని విచారించ‌గా.. వారి డెడ్ బాడీలు ఉన్న ప్ర‌దేశానికి తీసుకెళ్లి చూపించాడు.

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన.. లిఫ్ట్ అడిగి బైకర్‌పై ఇంజెక్షన్‌తో దాడి..

నిందితుడి ఆరోగ్య ప‌రిస్థితి కూడా బాగాలేక‌పోవ‌డంతో నాగర్‌కర్నూల్ ఉన్న గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుకు పోలీసులు.. మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్ పంపించారు.  అనంత‌రం మహబూబ్‌నగర్ గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్ కు పంపించారు. సెప్టెంబ‌ర్ 16వ తేదీన డిశ్చార్జ్ చేశారు. అయితే అత‌డి శ‌రీరంపై అమ‌ర్చిన ప‌రిక‌రాల‌ను అలాగే ఉంటాచారు. బుధ‌వారం హాస్పిట‌ల్ కు తిరిగి వ‌స్తే వాటిని తొలగిస్తామ‌ని డాక్ట‌ర్లు తెలిపారు. 

కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి ఐదేళ్ల చిన్నారి మృతి..

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నిందితుడు నేరుగా త‌న ఇంటికి చేరుకున్నాడు. కానీ అత‌డి తీరులో మ‌ళ్లీ ఎలాంటి మార్పూ రాలేదు. మ‌ళ్లీ వేధింపుల‌కు గురి చేయ‌డం ప్రారంభించాడు. దీంతో మ‌హేశ్వ‌రికి ఓపిక న‌శించింది. ఆదివారం పొద్దున ఇంట్లో ప‌డుకున్న భ‌ర్త గొంతు కోసి చంపేసింది. అనంత‌రం పోలీసు స్టేష‌న్ కు వెళ్లి భ‌ర్త‌ను చంపిన విషయం చెప్పింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios