తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకం, వారికి ఉన్న అర్హతలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విశ్లేషణాత్మక నైపుణ్యాలు కలిగిన ప్రముఖులతో పోస్టులను భర్తీ చేయాలని కోర్టు సూచించింది. 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సభ్యుల నియామకం పట్ల తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నియామకాలకు సంబంధించిన రికార్డులను నవంబర్ 14లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని గురువారం ఆదేశించింది.

కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్: యాదాద్రికి బయలుదేరిన బీజేపీ తెలంగాణ చీఫ్

మీడియా జర్నలిస్టు, రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్, రిటైర్డ్ ప్రైమరీ స్కూల్ టీచర్, ప్రైవేట్ ఆయుర్వేద ప్రాక్టీషనర్‌లను టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా నియమించడం ఆశ్చర్యంగా ఉందని కోర్టు పేర్కొంది. అపారమైన పరిజ్ఞానం, విశ్లేషణాత్మక నైపుణ్యాలు కలిగిన ప్రముఖులతో పోస్టులను భర్తీ చేయాలని కోర్టు సూచించింది. 

ప్రస్తుతం రమావత్ ధన్ సింగ్, బడి లింగారెడ్డి, సుమిత్రా ఆనంద్ తనోబా, డాక్టర్ అరవిల్లి చంద్ర శేఖర్ రావు, ఆర్. సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డి టీఎస్ పీఎస్సీ సభ్యులుగా ఉన్నారు. వారి నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై గురువారం కోర్టులో వాదనలు జరిగాయి. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు:ఆ ముగ్గురికి 41 ఎ సీఆర్‌పీసీ నోటీసులు

పిటిషనర్ తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా సభ్యులను నియమించుకుందని తెలిపారు. అయితే టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల 32ఏ, 32బీ నిబంధనల ప్రకారం నియామకాలు జరిగాయని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. కానీ ఆయన సమాధానంతో బెంచ్ సంతృప్తి చెందలేదు.

కేసీఆర్‌కి బండి సంజయ్ సవాల్:యాదాద్రి ఆలయానికి వెళ్లే విషయమై రాని స్పష్టత

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ లో ఎంపిక ప్రక్రియను ఎందుకు వెల్లడించలేదని ప్రధాన న్యాయమూర్తి భుయాన్ ప్రశ్నించారు. సభ్యుల గత నేపథ్యంపై ఆశ్చర్యపోయిన కోర్టు, వారి నియామకాలకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.