జగిత్యాల జిల్లా ధర్మపురిలో యువతి కిడ్నాప్ యత్నం కలకలం సృష్టించింది. యువ‌తి స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించ‌డంతో కిడ్నాప్ నుంచి తప్పించుకుంది. 

ఆ యువ‌తికి మూడు రోజుల క్రితం ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఆ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు స్నేహితులు స్టేట‌స్ ల రూపంలో పెట్టుకున్నారు. ఇది న‌చ్చ‌ని ఓ యువ‌కుడు ఆ యువ‌తిని కిడ్నాప్ చేయాల‌నుకున్నాడు. త‌న స్నేహితుల‌ను తీసుకొని ఆ యువ‌తి ఇంటికెళ్లి ఆమెను లాక్కొచ్చి కారులో తీసుకెళ్లాడు. కానీ స‌డెన్‌గా కారు చెడిపోవ‌డంతో వారి ప్లాన్ ఫెయిల‌య్యింది. దీంతో ఆ యువ‌తి గ‌ట్టిగా అర‌వ‌డంతో చుట్టుప‌క్క‌ల వారు వ‌చ్చి ఆమెను కాపాడారు. ఈ క్ర‌మంలో ఆ యువ‌తికి గాయాలయ్యాయి. ఈ ఘ‌ట‌న ధ‌ర్మ‌పురిలో మంగ‌ళ‌వారం క‌ల‌క‌లం సృష్టించింది. పోలీసులు ఆ యువ‌కుల‌పై కేసు న‌మోదు చేశారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు ఘ‌ట‌న వివ‌రాలు వెళ్ల‌డించారు. 

లోక్‌సభను కుదిపేసిన లఖింపూర్ ఖేరీ ఘటన.. రాహుల్ గాంధీ వాయిదా తీర్మానం.. కేంద్ర మంత్రిని తొలగించాలని డిమాండ్..

ధ‌ర్మ‌పురికి చెందిన ఓ యువ‌తికి వెల్గటూర్ మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తితో మూడు రోజుల క్రితం ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఈ ఫంక్ష‌న్ ఫొటోలు స్నేహితులు స్టేట‌స్‌ల రూపంలో పెట్టుకున్నారు. ప‌లు గ్రూప్ ల‌లో కూడా స‌ర్య్కులేట్ అయ్యాయి. దీంతో ఆ యువ‌తిని గ‌తంలో ఇష్ట‌ప‌డిన యువ‌కుడికి ఈ ఫొటోలు న‌చ్చలేదు. దీంతో ఆమెను కిడ్నాప్ చేయాల‌నుకున్నాడు. జగిత్యాల జిల్లాలోని సారంగ‌పూర్ మండ‌లం రేచ‌పల్లి గ్రామానికి చెందిన రాజేంద‌ర్ అనే యువ‌కుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆమెను కార్‌లో కిడ్నాప్ చేయాల‌నుకున్నాడు. అనుకున్న‌ట్టుగానే ఆ యువ‌తి ఇంటికి వెళ్లి ఆమెను ఇంట్లోని నుంచి బ‌ల‌వంతంగా తీసుకొచ్చారు. అనంత‌రం ఆ కారులో ఆమెను ఎక్కించుకొని క‌మ‌లాపూర్ వైపు వెళ్లారు. అంతా ఆ యువ‌కులు అనుకున్న‌ట్టు స‌వ్యంగా సాగుతోంద‌నుకుంటున్న స‌మ‌యంలో కార్ ఒక్క‌సారిగా ఫెయిల్ అయ్యింది. ఆ యువ‌తి స‌మ‌య‌స్పూర్తిగా ఆలోచించి అర‌వ‌డం మొద‌లుపెట్టింది. కానీ ఇది న‌చ్చ‌ని రాజేంద‌ర్ త‌న వెంట తెచ్చుకున్న క‌త్తితో ఆమెను గాయాలపాలు చేశారు. క‌త్తితో గాయాలు చేయ‌డంతో ఆ యువ‌తికి ర‌క్త‌స్రావం కూడా జ‌రిగింది. ఆమె కేక‌లు చుట్టుప‌క్క‌ల వారికి వినిపించ‌డంతో అంద‌రూ ఆ కారును చుట్టుముట్టారు. వారంతా పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్క‌డికి చేరుకునే స‌మ‌యం లోపే యువకులు కారును అక్క‌డే వ‌దిలేసి పారిపోయారు. దీంతో పోలీసులు ట్రాలీ ఆటో సాయంతో ఆ కారును స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అనంత‌రం ఆ యువ‌తిని తీసుకొని వారి పేరెంట్స్ స్టేష‌న్‌కు వెళ్లారు. కిడ్నాప్‌కు య‌త్నించిన ఆ యువ‌కులపై కేసు పెట్టారు. వారిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేశారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఎల్. రమణను ఓడించేందుకు మంత్రి గంగుల కుట్ర..: రవీందర్ సింగ్ సంచలనం