Karimnagar MLC Election 2021: ఎల్. రమణను ఓడించేందుకు మంత్రి గంగుల కుట్ర..: రవీందర్ సింగ్ సంచలనం (Video)

కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన అభ్యర్థి ఎల్ రమణను ఓడించడానికి మంత్రి గంగుల కమలాకర్ ప్రయత్నించారని రవీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

Karimnagar MLC Election 2021: Ravinder Singh Sensational Allegations on Minister Gangula Kamalakar

కరీంనగర్: బిసి నాయకుడు ఎల్.రమణ (l . ramana)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడానికి మంత్రి గుంగుల కమలాకర్ (gangula kamalakar) కుట్రలు చేసారని మాజీ మేయర్ రవీందర్ సింగ్ (ravinder singh) సంచలన వ్యాఖ్యలు చేసారు. కరీంనగర్ జిల్లా (karimnagar district)కే చెందిన బిసి నాయకులు రమణ ఎమ్మెల్సీగా గెలిస్తే ఎక్కడ తన మంత్రి పదవికి ఎసరు వస్తుందోనన్న భయంతోనే ఆయనను ఓడించడానికి గంగుల కుట్ర చేసారని ఆరోపించారు. భాను ప్రసాద్ (bhanuprasar rao) కంటే రమణకు తక్కువ ఓట్లు రావడమే మంత్రి గంగుల కుట్రకు నిదర్శనమన్నారు.  

కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికల (karimnagar mlc election) ఫలితంపై రవీందర్ సింగ్ స్పందించారు. కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ (TRS Party)కి చెందిన స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లను ఇద్దరు అభ్యర్థులు భాను ప్రసాదరావు, ఎల్.రమణకు టీఆర్ఎస్ అధిష్టానం సమానంగా పంచిందని అన్నారు. కానీ క్యాంపులో వున్న ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎల్.రమణకు ఓడించడానికి గంగుల కుట్రలు చేసారు. అందువల్లే రమణకు 479 ఓట్లు వస్తే మరో టీఆర్ఎస్ అభ్యర్థి భానుప్రసాద్ కు 584 ఓట్లు వచ్చాయని రవీందర్ సింగ్ సంచలన కామెంట్స్ చేసారు.  

Video

టీఆర్ఎస్ పార్టీ నవంబర్ 23వ తేదీ నుండే క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టిందని గుర్తుచేసారు. మంత్రులతో పాటు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లతో పాటు వారి కుటుంబసభ్యులను కూడా క్యాంప్ కు తీసుకెళ్ళారని అన్నారు. అలాగే ఎన్నికల సమయంలో పొద్దున లేవగానే తన ఇంటిముందే కాకుండా మిత్రుల ఇంటిముందు పోలీసులను కాపలాగా ఉంచారని... ఇలా ప్రచారం చేసుకోడానికి కూడా అవకాశం లేకుండా చేసారన్నారు.  కాంగ్రెస్, బిజెపి ఓట్లను కూడా టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని రవీందర్ సింగ్ ఆరోపించారు.  

read more  కేసీఆర్ బొమ్మతోనే ఎమ్మెల్సీల విజయం... మా గెలుపు మంత్రమదే: మంత్రి గంగుల వ్యాఖ్యలు (Video)

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించడానికి టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేసిందన్నారు. ఇన్ని కుట్రలు చేసినా తనకు 232 ఓట్లు వచ్చాయని రవీందర్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా టీఆర్ఎస్ కు బుద్ధి చెపుతారని హెచ్చరించారు.   

''మంత్రి గంగుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఆటలు అడుతున్నాడు. నాకు ఒక్క ఓటు కూడా పడదని అన్నాడు... కేటీఆర్ తో కూడా చెప్పించాడు... అయినా నాకు 232 ఓట్లు వచ్చాయి. నన్ను గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించారు కాబట్టే ఇన్ని ఓట్లు వచ్చాయి. దీనికి మంత్రి గంగుల నైతిక బాధ్యత వహించాలి. అలాగే ఎల్.రమణకు తక్కువ ఓట్లు వచ్చినందుకు నైతిక బాధ్యత వహించి వెంటనే క్షమాపణ చెప్పాలి'' అని రవీందర్ సింగ్ డిమాండ్ చేసారు. 

read more అన్ని ప్రాంతీయ పార్టీలతో చర్చలు: టీఆర్ఎస్ నేత వినోద్

''ఉద్యమకారులని ఇప్పటికైనా దగ్గరకు తీసుకుని ఆదరించకుంటే టీఆర్ఎస్ కు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదు. కరీంనగర్ ఎమ్మెల్సీగా నేను ఓడినా నైతికంగా విజయం సాధించాను'' అని రవీందర్ సింగ్ పేర్కొన్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios