ఐపీఎస్ ఆఫీసర్ అంజనీ కుమార్ సస్పెన్షన్ ను ఎత్తివేసిన ఈసీ
తెలంగాణ డీజీపీ (Telangana DGP)గా సేవలందిస్తున్న సమయంలోనే సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ ఆఫీసర్ అంజనీ కుమార్ (IPS Officer Anjani kumar)కు ఊరట లభించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను ఎన్నికల సంఘం ఎత్తివేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.
Anjani kumar : ఇటీవల ఐపీఎస్ ఆఫీసర్ అంజనీ కుమార్ పై ఎన్నికల్ కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తాజాగా దానిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీజీపీగా సేవలందించిన ఆయన.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని వెళ్లి కలిశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అయ్యాయి.
ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ భారీ భూకంపం.. వణికిపోయిన తాలిబన్ పాలిత దేశం
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే డీజేపీ అంజనీ కుమార్.. రేవంత్ రెడ్డి కలవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడ్ ను ఉల్లంఘిచారని పేర్కొంటూ ఆయనను అదే రోజు సాయంత్రం సస్పెండ్ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాజాగా ఆయన ఎన్నికల కమిషన్ ముందు వివరణ ఇచ్చుకున్నారు.
టీఎస్ పీఎస్సీ : జనార్థన్ రెడ్డి రాజీనామాను ఆమోదించని గవర్నర్..
తాను కావాలని ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని అధికారులతో డీజీపీ అంజనీ కుమార్ చెప్పారు. ఆ రోజు రేవంత్ రెడ్డి తనను పిలిచారని, అందుకే వెళ్లానని తెలిపారు. ఇంకో సారి ఇలా జరగబోదని ఆయన ఎన్నికల సంఘానికి స్పష్టం చేశారు. ఆయన అభ్యర్థనను ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంది. అంజనీ కుమార్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.