టీఎస్ పీఎస్సీ : జనార్థన్ రెడ్డి రాజీనామాను ఆమోదించని గవర్నర్..
ఈ మేరకు పేపర్ లీకులకు జనార్థన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ చర్యలు తీసుకోవాలంటూ డిఓపిటీకి గవర్నర్ లేఖ రాశారు.
హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసైకి పంపించారు. కానీ ఆమె ఆ రాజీనామాను ఆమోదించలేదు. పేపర్ లీకులకు బాధ్యులు ఎవరో తేల్చకుండా జనార్థన్ రెడ్డిని రాజీనామాకు ఆమోదం తెలపలేనని అన్నారు. ఈ మేరకు పేపర్ లీకులకు జనార్థన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ చర్యలు తీసుకోవాలంటూ డిఓపిటీకి గవర్నర్ లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ జనార్దన్ రెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా లేఖ పంపారు. గవర్నర్ ఆమోదం తరువాత ఆ లేఖను అవసరమైన తదుపరి చర్యల కోసం ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపుతారు.
2021లో జనార్థన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి అనేక సమస్యలు ఎదుర్కొంది. ముఖ్యంగా పేపర్ లీక్ లు తీవ్ర దుమారంరేపాయి. ముఖ్యంగా 2022లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీక్. తదనంతరం, మార్గదర్శకాల ఉల్లంఘన కారణంగా తెలంగాణ హైకోర్టు రెండవ ప్రయత్నాన్ని రద్దు చేసింది. జనార్దన్ రెడ్డి తన రాజీనామాను సమర్పించే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కలిశారని చెబుతున్నారు.