Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కానిస్టేబుల్ కు కుచ్చుటోపి

ఆయనొక కానిస్టేబుల్. పది మందికి జాగ్రత్తలు చెప్పాల్సిన స్థానంలో ఉన్న ఉద్యోగి. పది మందికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి. కానీ ఆయన మోసపోయాడు. అమాయకంగా మోసగాళ్ల బుట్టలో పడ్డాడు. ఉత్త పుణ్యానికి 50వేల రూపాయలు పోగొట్టుకున్నాడు.

the cyber criminal cheated by nalgonda constable

ఆయనొక కానిస్టేబుల్. పది మందికి జాగ్రత్తలు చెప్పాల్సిన స్థానంలో ఉన్న ఉద్యోగి. పది మందికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి. కానీ ఆయన మోసపోయాడు. అమాయకంగా మోసగాళ్ల బుట్టలో పడ్డాడు. ఉత్త పుణ్యానికి 50వేల రూపాయలు పోగొట్టుకున్నాడు.

నల్లగొండలో జరిగింది ఈ సంఘటన. ఓ మోసగాడి మాయమాటల్లో పడి తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50 వేలు పోగొట్టుకున్నాడు ఒక నల్లగొండ కానిస్టేబుల్. జిల్లా జైలులో వార్డర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్‌ ఎంపర్ల వెంకట్‌రెడ్డికి శనివారం ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. ముంబై నుంచి బ్యాంకు అధికారిని మాట్లాడుతున్నానంటూ చెప్పిన అవతలి వ్యక్తి .. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ సంఖ్య అనుసంధానం చేస్తామని వివరాలు చెప్పమన్నారు.

దేశమంతా సైబర్ నేరగాళ్లు ఈ పేరుతో మోసాలు చేస్తున్నారని కనీస ఊహ కూడా ఆ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి తట్టలేదు. వెంటనే బ్యాంకు ఖాతా నెంబరు, మిగతా బ్యాంకు సమాచారమంతా అవతి వ్యక్తికి చెప్పిండు. ఈ క్రమంలో మాయమాటలు చెప్పి వెంకట్‌రెడ్డి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50 వేలు డ్రా చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios