టెట్ పరీక్షకు మరో అడ్డంకిసిలబస్ పై హైకోర్టును ఆశ్రయించిన రచనా రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వివాదాల సుడిగుండంలో చిక్కుకుపోతున్నాయి. నిరుద్యోగుల కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాల్లో చిక్కడంతో నిరుద్యోగ యువత సర్కారుపై రగిలిపోతున్నారు. తాజాగా టిఎస్ టెట్ పై మరో వివాదం రాజుకుంది.
తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టులో టిఎస్ టెట్ పై ఫిటిషన్ దాఖలైంది. టెట్ పరీక్ష నోటిఫికేషనను ఛాలేంజ్ చేస్తూ నిరుద్యోగుల తరుపున న్యాయవాది రచనారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
టెట్ సిలబస్ చాలా ఎక్కువగా ఉందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎన్ సిటిఇ నిబంధనలకు విరుద్ధంగా సంబంధం లేని సిలబస్ అంతా టెట్ అభ్యర్థుల మీద రుద్దే ప్రయత్నం తెలంగాణ సర్కారు చేస్తోందని అభ్యర్థులు అంటున్నారు. ఆ సిలబస్ ను ఎన్ సిటిఇ నిబంధనల మేరకు సవరించి తగ్గించాలని కోరుతున్నారు.
దీనిపై విచారించిన హైకోర్టు పిటీషన్ స్వీకరించింది. తెలంగాణ టెట్ కన్వీనర్ కు మూడు వారాల్లోగా కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశించింది న్యాయస్తానం. అయితే ఈనెల 23న టెట్ పరీక్ష జరగబోతున్నది. కేవలం మరో రెండు రోజుల్లో పరీక్ష ఉన్న నేపథ్యంలో టెట్ పై కోర్టులో కేసు నమోదు కావడం అభ్యర్థుల్లో చర్చనీయాంశమైంది. కేసులో తదుపరి విచారణను హై కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.
