తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారయ్యింది. ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రాగా, ఇప్పుడు పదో తరగతి పరీక్షలు ఎప్పుడు జరగనున్నాయో తేలిపోయింది. దీంతో సందిగ్ధతకు తెరపడింది. 

హైదరాబాద్ : telanganaలో ఇప్పటికే Schedule of Inter Examinationsల్లో ప్రకటించగా త్వరలో Tenth grade examల షెడ్యూల్ ను కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఈ మేరకు మే నెలలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలని SSC బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. మే 9-12 తేదీల మధ్య పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక.. పదో తరగతి పరీక్షలు పెట్టాలనుకుంటే మే 11, 12 తేదీల్లో ప్రారంభం అవుతాయని సమాచారం.

వాస్తవానికి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ఏప్రిల్ లోనే జరగాల్సి ఉంది. ఇందుకోసం నవంబర్ నుంచే అధికారులు కసరత్తు చేస్తారు. అయితే కరోనా మూలంగా పరీక్షలు లేకుండానే గతేడాది విద్యార్థులను పాస్ చేశారు. ఈసారి కూడా కోవిడ్ థార్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు ఉంటాయా? లేదా? అని డోలాయమానంలో విద్యాశాఖ ఉంది. తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో… పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశిస్తే ఈ రోజు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 

కాగా, తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చి నెలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష తరగతులు కొనసాగుతున్నందున.. విద్యార్థులకు సంబంధిత కాలేజ్ లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. కోవిడ్ ఉద్ధృతి కారణంగా గతేడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు హోమ్ ఆధారిత అసైన్‌మెంట్‌లుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. 

రెగ్యులర్ స్ట్రీమ్ ల విద్యార్థులకు పూర్తి మార్కులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం.. విద్యార్థులకు సంబంధిత కాలేజీల్లో ప్రాకికట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మొత్తం సిలబస్‌లో 70 శాతం కవర్ చేస్తూ ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నామని.. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారి ఒకరు తెలిపారు. 

ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలలో అసైన్‌మెంట్ల ద్వారా విద్యార్థులకు మార్కులను అంచనా వేయనున్నారు. విద్యార్థులకు అసైన్‌మెంట్‌లు ఇళ్ల వద్ద పూర్తి చేసి.. సంబంధిత కాలేజీల్లో సమర్పించాల్సి ఉంటుంది.