తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలను ఎస్ఎస్ సీ బోర్డు ప్రకటించింది. మే 5వ తేదీ నుంచి మే 26 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ ఏడాది 11 పేపర్ల విధానానికి తెర దించుతూ పలు మార్పులు చేసిన విద్యా శాఖ కేవలం 6 పరీక్షలనే నిర్వహించనుంది. 

కరోనా నేపథ్యంలో గతేడాది తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని  అప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నల్‌, అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇచ్చారు.  

లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ కూడా కొన్ని లక్షల మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉండే... అయితే  వారందరికీ సెంటర్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలి.. భౌతిక దూరం, దీనికి తోడు ప్రైవేట్ విద్యాసంస్థలు ఎంతోమంది విద్యార్ధులను తొలగించడంతో ఇన్విజిలేటర్ల కొరత వేధించింది.

గత యేడాది జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో మినహా రాష్ట్రం మొత్తం పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించినా కూడ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.