హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీసమ్మె ఉత్కంఠకు తెరలేపుతుంది. సాయంత్రం 6 గంటలు లోగా విధుల్లో చేరితే ఉద్యోగులుగా పరిగణిస్తామని లేని పక్షంలో ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. 

ప్రభుత్వం హెచ్చరికలను ఉద్యోగులు ఖాతరు చేయలేదు. భవిష్యత్ కార్యచరణను సైతం ప్రకటించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ప్రభుత్వంలో ఆర్టీసీని విడుదల చేసేవరకు పలు రకాలుగా నిరసనలు తెలుపుతామని హెచ్చరించింది. 

ఇకపోతే ఇప్పటి వరకు జీతాలు అందకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రతీ నెల ఒకటోతారీఖున జీతాలు చెల్లించే ప్రభుత్వం ఈసారి చెల్లించకపోవడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో జీతాల చెల్లింపుల్లో ఆలస్యం అయిందని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఈనెల 5న జీతాలు చెల్లిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఒకవేళ సమ్మె కొనసాగిస్తే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందా అన్న సందేహం నెలకొంది.  

ఈ వార్తలు కూడా చదవండి

యూనియన్ నేతల స్వార్థం కోసమే సమ్మె: కాకరేపుతున్న మంత్రి తలసాని వ్యాఖ్యలు

శాశ్వత ప్రత్యామ్నాయాలు ఇవీ: ఆర్టీసి కార్మికులకు అజయ్ ఫైనల్ వార్నింగ్