టీఆర్ఎస్ విజయగర్జన సభకు భూములివ్వం: దేవన్నపేటలో ఉద్రిక్తత

టీఆర్ఎస్ విజయగర్జన సభకు తమ పంట భూములు ఇవ్వబోమని దేవన్నపేట గ్రామానికి చెందిన రైతులు తేల్చి చెప్పారు. ఈ భూములను పరిశీలించేందుకు వచ్చిన టీఆర్ఎస్ నేతలతో వాగ్వాదానికి దిగారు.ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.

Tension Prevails AT Devannapeta Village in Hanmakonda District

హన్మకొండ: టీఆర్ఎస్ vijaya garjana sabha  సభకు తమ భూములను ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పడంతో దేవన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకొంది. టీఆర్ఎస్ శ్రేణులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొకదశలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకొని ఉద్రిక్తత నెలకొంది.

also read:టీఆర్ఎస్ విజయగర్జన సభ వాయిదా: దీక్షా దివస్ రోజునే వరంగల్‌లో సభ

హన్మకొండ జిల్లాలోని హసన్‌పర్తి మండలం Devannapeta గ్రామంలో విజయగర్జన సభ కోసం స్థలాన్ని పరిశీలించేందుకు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్  లు  బుధవారం నాడు వచ్చారు.

దేవన్నపేట గ్రామ శివారులోని  ఖాళీ స్థలంతో పాటు పంటపొలాలను Trs నేతలు పరిశీలించారు. అయితే టీఆర్ఎస్ సభ కోసం పంట పండే తమ భూములను ఇచ్చేది లేదని రైతలు టీఆర్ఎస్ నేతలకు చెప్పారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.ఈ క్రమంలో స్థానిక బీజేపీ నేతలు కూడా రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో రైతులు, టీఆర్ఎస్, Bjp నేతల మధ్య వాగ్వాదం తీవ్రమైంది. వీరి మధ్య తోపులాట చోటు చేసుకొంది. అక్కడే ఉన్న పోలీసులు  ఇరువర్గాలను అడ్డుకొన్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

టీఆర్ఎస్ సభ నిర్వహణకు తమ పంట భూములిస్తే  నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ఈ విషయమై బీజేపీ జిల్లా నేత రావు పద్మ దృష్టికి స్థానిక బీజేపీ నేతలు తీసుకొచ్చారు. ఆమె వెంటనే దేవన్నపేటకు వచ్చి రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు.ఈ విషయమై ఆమె జిల్లా కలెక్టర్ తో  మాట్లాడారు. రైతుల పంట భూములను టీఆర్ఎస్ నేతలు తమ సభకు తీసుకోకుండా ఉండాలని ఆమె కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడేళ్ల కాలంలో ప్రజల కోసం తీసుకొచ్చిన పథకాలు,, కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు విజయగర్జన సభను గులాబీ దళం నిర్వహిస్తోంది. ఈ నెల 15వ తేదీనే ఈ సభను నిర్వహించాలని తొలుత నిర్ణయం తీసుకొన్నారు. దీక్షా దివస్ రోజున ఈ సభను నిర్వహించాలని పార్టీ నేతలు చేసిన సూచన మేరకు ఈ సభను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు తరలిరావాలని టీఆర్ఎస్ కోరింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios