టీఆర్ఎస్ ర్యాలీని అడ్డుకొన్న బీజేపీ: జనగామలో జెండాకర్రలతో కొట్టుకొన్న ఇరువర్గాలు,ఉద్రిక్తత
జనగామ జిల్లాలో టీఆర్ఎస్ ర్యాలీని బీజేపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నానికి టీఆర్ఎస్ నుండి తీవ్ర ప్రతి ఘటన ఎదురైంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకొన్నాయి.
హైదరాబాద్: రాజ్యసభలో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ TRS శ్రేణులు తలపెట్టిన ర్యాలీ బుధవారం నాడు ఉద్రిక్తతకు దారి తీసింది. BJP,టీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం జెండా కర్రలతో దాడులకు దిగారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని Narendra MOdi మంగళవారం నాడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన గురించి మోడీ మాట్లాడారు. Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. జనగామలో ఇవాళ టీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించే సమయంలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కూడా ర్యాలీ నిర్వహించింది. రెండు ర్యాలీలు ఎదురుపడ్డాయి. దీంతోరెండు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేసుకొన్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది. టీఆర్ఎస్ నిరసనను బీజేపీ అడ్డుకొంది. దీంతో టీఆర్ఎస్,బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఇరు వర్గాలు జెండా కర్రలతో పరస్పరం కొట్టుకొన్నారు. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకొన్నారు. బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై పరిగెత్తించారు. టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపు చేశారు. రెండు పార్టీలకు చెందిన పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై మోడీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్, కాంగ్రెస్ లు తప్పుబడుతున్నాయి. మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఇవాళ తెలంగాణ రాష్రంలో నిరసనలు చేపట్టాయి. అయితే ఇదే తరుణంలో బీజేపీ నేతలు ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను సమర్దిస్తున్నారు. కాంగ్రెస్ ను మోడీ విమర్శిస్తే టీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందిస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది.ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్దం తారాస్థాయికి చేరుకొంది. ఈ తరుణంలో మోడీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ అస్ర్తంగా తీసుకొంది. బీజేపీపై ఎదురు దాడికి టీఆర్ఎస్ ఈ అంశాన్ని ఎంచుకొంది. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా వెనక్కి తగ్గడం లేదు.గతంలో తమ ప్రభుత్వం మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సమయంలో ఎలాంటి అశాంతి చోటు చేసుకోలేదని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.