వరద బాధితులను ఆదుకోవాలని జీహెచ్ఎంసీ ముందు కాంగ్రెస్ ధర్నా: అరెస్ట్, ఉద్రిక్తత

భారీ వర్షాల కారణంగా  వరద బాధితులు ఆదుకోవాలని జీహెచ్ఎంసీ ముందు  కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Tension Prevails After  Congress Workers Protest infront of GHMC Office lns

హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా  వరద భాదితులను ఆదుకోవాలని కోరుతూ  శుక్రవారంనాడు జీహెచ్ఎంసీ ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను  పోలీసులు అరెస్ట్  చేశారు.  ఈ సమయంలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య  తోపులాట, వాగ్వాదం చోటు  చేసుకుంది. దీంతో ఉద్రిక్తత చోటు  చేసుకుంది.

భారీ వర్షాల కారణంగా  నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు  నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  వరద బాధితులకు  రూ. 10 వేల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్  చేసింది.  అంతేకాదు వరద బాధితులకు  ప్రభుత్వం  అన్ని రకాల సహాయం అందించాలని కోరింది. 

వరద ప్రభావిత ప్రాంతాల  ప్రజలను ఆదుకోవాలని  కోరుతూ గన్ పార్క్ నుండి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు  ఇవాళ ర్యాలీ నిర్వహించారు.జీహెచ్ఎంసీ కార్యాలయం వద్దకు రాగానే గేటు బయట బైఠాయించారు. కొందరు  గేటు పైకి ఎక్కి కార్యాలయంలోకి వెళ్లారు.  జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వెళ్లిన వారిని  పోలీసులు అడ్డుకున్నారు.  జీహెచ్ఎంసీ ముందు  ధర్నాకు దిగిన వారిని  పోలీసులు  అరెస్ట్  చేశారు.

దాదాపు వారం రోజులుగా  హైద్రాబాద్  నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడ నమోదయ్యాయి.  భారీ వర్షాల నేపథ్యంలో  విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  నగరంలోని చాలా  ప్రాంతాల ప్రజలు  ఇంకా  వరద బురదలోనే  ఉన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని ఇవాళ జీహెచ్ఎంసీ  ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios