ఆదిలాబాద్ లో టెన్షన్ టెన్షన్..

ఆదిలాబాద్ లో టెన్షన్ టెన్షన్..

ప్రశాంతతకు మారుపేరు, అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు స్థానిక లంబాడీలపై కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు.

ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలోని ఉస్నాపూర్ తండాలో ఈ దాడులు జరిగాయి. అయితే కుమ్రం భీం విగ్రహానికి చెప్పుల మాల వేసినందుకు ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేసి దాడులకు దిగినట్లు తెలుస్తోంది. అయితే చెప్పులమాల వేసింది లంబాడీ ప్రజలేనా అన్నది ఇంకా తేలలేదు.

ఈ దాడులతో ఆదిలాబాద్ లో అలజడి రేగింది. పలు షాపులను ఆదివాసీలు తగులబెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు.

అయినా ఇంకా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో భాష్పవాయు గాళాలు ప్రయోగించారు. ఈ ఆందోళనల తాలూకు మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos