తల్లీ కొడుకు మృతి

నిజామాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తల్లితోపాటు, రెండేళ్ల కొడుకు అనుమానాస్పద మృతి జిల్లాలో కలకలం రేపింది. తన రెండేళ్ల కొడుకుకు విషమిచ్చి తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని స్థానికుల నుంచి సమాచారం తెలుస్తోంది.

"

జిల్లాలోని దర్పల్లి మండలం పల్లె చెరువు తండా లో ఈ సంఘటన జరిగింది. అయితే ఆమె అత్త, తోటి కోడలు కలిసి హత్య చేశారంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. అత్త తోటి కోడలి పై దాడి చేసి చితక బాదారు. ఆగ్రహంతో అత్త నివసించే ఇంటికి నిప్పంటించారు.