Asianet News TeluguAsianet News Telugu

నన్ను అరెస్ట్ చేస్తే అత్మహత్య చేసుకుంటా!: RTC JAC కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి

RTC JAC కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అశ్వత్థామ రెడ్డి  అరెస్టు చేయడానికి  ఆయన  ఇంటికి భారీగా  పోలీసులు చేరుకున్నారు. 
ఉదయం నుంచి ఇంట్లో దీక్ష చేస్తున్న ఆయనను  అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.   బీఎన్ రెడ్డినగర్‌లోని ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. 

Tension at RTC JAC Convener Ashwaththama Reddy  Home
Author
Hyderabad, First Published Nov 16, 2019, 6:10 PM IST

RTC JAC కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అశ్వత్థామ రెడ్డి  అరెస్టు చేయడానికి  ఆయన  ఇంటికి భారీగా  పోలీసులు చేరుకున్నారు. 
ఉదయం నుంచి ఇంట్లో దీక్ష చేస్తున్న ఆయనను  అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.   బీఎన్ రెడ్డినగర్‌లోని ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారు.  తనను అరెస్టె చేస్తే  అత్మహత్య చేసుకుంటానని పోలీసులను ఆయన హెచ్చరించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకోంది.

అలాగే మహబూబ్ నగర్‌లో కూడా ఉద్రిక్తతత పరిస్థితిలు నెలకోన్నాయి.17 మంది మహిళ ఆర్టీసీ జేఎసీ కార్మకులు   ఓ ఇంట్లో నిరహాదీక్షకు దిగారు. వారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు యత్నం.తాళాలు పగలగోట్టి వారిని అదుపులోకి తీసుకోవాడినికి పోలీసులు సిద్దమయ్యారు

ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆఫీసులో దీక్షకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనియన్‌ ఆఫీసు ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డిని అరెస్ట్‌ చేశారు. అశ్వత్థామరెడ్డిని కూడా అరెస్ట్‌ చేసేందుకు ఉదయం నుండే ఆయన ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి ఇంటికి ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు పోలీసుల యత్నిస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అశ్వత్థామరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచడంతో ఆయన ఇంట్లోనే దీక్షకు దిగారు. ఉదయం నుంచి బిఎన్ రెడ్డి నగర్ లోని ఆయన ఇంటి వద్ద మినీ యుద్ధమే నడుస్తుంది. పోలీసులు లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా కార్మికులు వారిని అడ్డుకుంటున్నారు. 

Alsoread సకల జనుల సమ్మె రికార్డుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె...

గత నెల రోజులకుపైగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు విధుల్లోకి చేరేది లేదంటూ ఆర్టీసీ కార్మికులు భీష్మించుకు కూర్చున్నారు. ప్రభుత్వం కూడా పట్టించుకోనట్లుగానే వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో సమ్మె కొనసాగుతూనే ఉంది. కాగా.. ప్రభుత్వం తమ సమ్మెను పట్టించుకోని నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ దీక్షకు పిలుపునిచ్చింది.

ఇదిలా ఉండగా... ఇటీవల ఈ సమ్మె విషయంపై అశ్వత్దామ రెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. విలీనం అంశం విఘాతం కలిగిస్తుందని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ నేపథ్యంలోనే విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదే సమయంలో మిగిలిన డిమాండ్లపై చర్చలు జరపాలని కోరుతున్నామని... ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికులు ఆత్మస్ధైర్యాన్ని కోల్పోవద్దని.. శుక్రవారం డిపోల నుంచి గ్రామాలకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

16న నిరవధిక దీక్ష, బస్సులను ఆపే కార్యక్రమం, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్ టూ కోదాడ బంద్ నిర్వహిస్తామన్నారు. చనిపోయిన 23 కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు.

రేపో ,ఎల్లుండి చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో గవర్నర్ ను కలుస్తామని.. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కూడా కలుస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు,కనీసం పరామర్శించిన దాఖలాలు లేవని అశ్వత్థామరెడ్డి ధ్వజమెత్తారు.

ఆర్టీసీ ప్రైవేటు పరం చేస్తే బడుగు బలహీన వర్గాలు ఉపాధి అవకా శాన్ని కోల్పోవలసి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీల్లో అది రుజువవుతోందని.. సడక్ బంద్ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని అశ్వత్థామరెడ్డి విజ్ఙప్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios