Asianet News TeluguAsianet News Telugu

ఇదేం భక్తి రా బాబు?

  • పాత నోట్లతో నిండిన దేవుడి హుండీలు
temple hundi

తెలుగు నాట భక్తి భావం బా...గా.. పెరిగిపోతుంది. దీనికంతా కారణం మోదీనే అంటే ఆశ్చర్యపోకండి. ప్రధాన మంత్రి పెద్ద నోట్లు ఇకపై చెల్లవని చెప్పేసరికి బాగా డబ్బున్న వారందరికీ వెంటనే దేవుడు గుర్తొచ్చాడు. ఇంకేముంది ఉన్న వాళ్లంతా ఉన్నపళంగా ఇప్పుడు తీర్ధయాత్రలు మొదలు పెట్టారు. అంతేకాదు దేవుడికే శఠగోపం పెట్టారు. ఇంతకీ ఏంటా శఠగోపం అనుకుంటున్నారా..

 

కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేయడంతో దేవుళ్ల హుండీకీ డిమాండ్‌ పెరిగింది. చాలామంది భక్తులు రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లను హుండీలో కానుకలుగా సమర్పిస్తున్నారు. దీంతో అన్నీ ఆలయాల హుండీలు పాత నోట్ల కట్టలతో కళకళలాడుతున్నాయి.

 

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీలో కొందరు మహా భక్తులు లక్షల్లో పాత నోట్లను వేశారు. ఓ వ్యక్తి రూ.500, రూ. వెయ్యి నోట్లతో రూ.4.50 లక్షలు, మరో అజ్ఞాత వ్యక్తి పాత రూ.వెయ్యి నోట్లతో లక్ష రూపాయలను హుండీలో వేయడం గమనార్హం. కోడ మొక్కుల రాజన్నకు ఇలా చెల్లని నోట్లతో కొందరు తమ భక్తి ప్రపత్తులను బాగానే చాటుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios