ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణలో సింగిల్ డిజిట్స్‌కి పడిపోయిన ఉష్ణోగ్రతలు: గజగజ వణుకుతున్న ప్రజలు

ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లో  ఉష్ణోగ్రతలు పడిపోయాయి.  దీంతో చలి  తీవ్రత  పెరిగింది. ప్రజలు చలికి గజ గజ  వణికిపోతున్నారు.  చలి  తీవ్రత  పెరగడంతో  ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Temperatures dropped  in Andhra Pradesh and Telangana

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు  పడిపోతున్నాయి. రెండు  రాష్ట్రాల్లో  ఉష్ణోగ్రతలు సింగిల్  డిజిట్స్ కు పడిపోయాయి. దీంతో చలికి  ప్రజలు  ఇబ్బంది పడుతున్నారు. రానున్న  రోజుల్లో చలి  మరింత పెరిగే  అవకాశం ఉందని  వాతావరణ  శాఖ  అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి  పెరిగిన నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు  జాగ్రత్తగా  ఉండాలని  వైద్యులు  సూచిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని  పలు  జిల్లల్లో  ఉష్ణోగ్రతలు  10 డిగ్రీలకు  లోపుగా  నమోదౌతున్నాయి.  దీంతో  ఆయా  ప్రాంతాల  ప్రజలు  చలికి  గజ  గజ  వణికిపోతున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోని  కొమురం భీమ్  జిల్లాలో  అత్యల్ప ఉష్ణోగ్రతలు  నమోదయ్యాయి.   ఈ జిల్లాలో  ఆదివారంనాడు 7.3 డిగ్రీల  ఉష్ణోగ్రత నమోదైంది.సంగారెడ్డి  జిల్లా  సత్వార్  లో  7.5 డిగ్రీలు
కొమురంభీమ్  జిల్లాలో 7.3 డిగ్రీలు,మెదక్  జిల్లా  లింగాయిపల్లిలో  9..2 డిగ్రీలు కనిష్ట  ఉష్ణోగ్రత
మంచిర్యాల  జిల్లాలో  9.5  డిగ్రీల కనిష్ట  ఉష్ణొగ్రతలు నమోదయ్యాయి.  అదే విధంగా  సిద్దిపేట  జిల్లాలోని  సిద్దిపేట  జిల్లా  హబ్సిపూర్ లో  10.1  డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత  నమోదైంది.ఆదిలాబాద్  జిల్లాలో  8.3  డిగ్రీలు, నిర్మల్  జిల్లాలో  9.2  డిగ్రీల కనిష్ట  ఉష్ణోగ్రతలు  రికార్డయ్యాయి.  హైద్రాబాద్  లో  కూడా  చలి  తీవ్రత  పెరిగింది.  గాలిలో  తేమ  శాతం  తగ్గిపోవడంతో  చలి పెరిగిందని  అధికారులు  చెబుతున్నారు. 

ఇక  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని పలు   జిల్లాల్లో  కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి  జిల్లా  చింతపల్లిలో  9.1 డిగ్రీలు, అరకులోయ మిననుములూరులో 11  డిగ్రీలు, పాడేరులో  13  డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు  నమోదైనట్టుగా  వాతావరణ  శాఖ  అధికారులు  తెలిపారు. 

ఈ  ఏడాది  అక్టోబర్  చివరి  వారం నుండి  ఉష్ణోగ్రతల  నమోదులో  హెచ్చతగ్గులు  కన్సించాయి. తెలంగాణలో  సాధారణంగా  నవంబర్ రెండో మాసంలో చలి  తీవ్రత  ప్రారంభం కానుంది.  కానీ  ఈ  ఏడాది  మాత్రం  అక్టోబర్ చివరి  వారం నుండి చలి ప్రభావం  కన్పించింది.  వాతావరణంలో  మార్పుల  కారణంగా   చలి  తీవ్రత  పెరగుతుందని  వాతావరణశాఖాధికారులు  తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios