Telangana: దేశంలో చలి తీవ్రత పెరిగింది. "చలి" పిడుగులా విరుచుకుపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోతున్నాయి. తెల్లవారు జామునా పొగమంచు విపరీతంగా కురుస్తోంది. తెలంగాణ, ఏపీ ఏజేన్సీ ప్రాంతాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
Telangana: దేశంలో చలి తీవ్రత (cold wave) పెరిగింది. "చలి" పిడుగులా విరుచుకుపడుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయికి పడిపోవడం.. పొగమంచు, చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు (Temperature) నిరంతరం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికి గజగజ వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. రొడ్డు పక్కల, వీధుల్లో చలి మంటలు కాచుకునే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో పేదలు శీతాకాలపు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చలికాలం తీవ్రంగా ఉండడంతో ఆటోడ్రైవర్లు, టీ అమ్మేవారు, ఉద్యోగాలు చేసుకునే వారు చలి (cold) ప్రభావానికి గురవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోతున్నాయి. తెల్లవారు జామునా పొగమంచు విపరీతంగా కురుస్తోంది. తెలంగాణలో ఏజేన్సీ ప్రాంతాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోతున్నాయి. తెల్లవారు జామునా పొగమంచు (cold wave) విపరీతంగా కురుస్తోంది. తెలంగాణలో ఏజేన్సీ ప్రాంతాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
మరీ ముఖ్యంగా పొగ మంచుతో జాతీయ రహదారులు ప్రమాదకరంగా మారుతున్నాయి. తెల్లవారుజామున విపరీతంగా కురుస్తున్న పొగ మంచుతో కురుస్తుండటంతో రోడ్డుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాహనాలు, రొడ్డుపై వెళ్లేవారు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చలిగాలు వీచడం పెరుగుతోంది. దీంతో శీతాకాలపు చలి ప్రభావం ప్రజలపై పడింది. ఎముకలు కొరికేలా చలి చంపేస్తోంది. తెలంగాణ చలి తీవ్రత అధికమైంది. వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఉష్ణోగ్రతలు (Temperature) కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. పొగమంచు దుప్పటి తెలంగాణం వణికిపోతున్నది. దీంతో ఉదయం, సాయంత్రం వెళల్లో ప్రజలు బయటకు రావాటం లేదు. తెలంగాలనలోని ఉమ్మడి ఆదిలాబాద్ లో చలి (cold) తీవ్రత పెరిగింది. జనగాం జిల్లాలో తెల్లవారు జాము నుండి ఈ చలి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయి పడిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లాలోనూ రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రెండు, మూడు రోజుల నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. జిల్లాలో ఈనెల 4న 10.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, 5న 10.1 డిగ్రీలకు పడిపోయింది. గురువారం 10.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత (Temperature) నమోదైంది.
ఏపీలోనూ చలి (cold) పంజా విసురుతోంది. ముఖ్యంగా విశాఖ మన్యంలో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. వారం రోజులుగా శీతల గాలులు అధికంగా వీస్తున్నాయి. దీంతో ఉదయం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పాడేరు, చింతపల్లి మండలాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాడేరు మినుములూరు కాఫీ బోర్డు వద్ద 10.12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్రలోని మరో ఊటీగా పేరుగాంచిన చింతపల్లి పరిధిలోని లంబసింగిలో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం రెండు, మూడు గంటల నుంచే చలి గాలులు వీస్తుండటంతో మన్యం ప్రజలు, పర్యాటకులు చలి (cold) మంటలు వేసుకుంటున్నారు. ఇక శీతాకాలంలో మన్యం అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.వంజంగి వద్ద మేఘాల కొండపై పర్యాటకుల సందడి మొదలైంది.
