మనసులను కలపడమే అలయ్ బలయ్ ఉద్దేశ్యం: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

రెండు తెలుగు రాష్ట్రాలు అన్నిరంగాల్లో అభివృద్ది పథంలో ముందుకు సాగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షను వ్యక్తం చేశారు. 

Telugu states should be forefront in development:Haryana Governor Bandaru  Dattatreya

హైదరాబాద్: కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరిని  కలపడమే అలయ్ బలయ్ ఉద్దేశ్యమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు.హైద్రాబాద్ నాంపల్లి  ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ ప్రసంగించారు. వ్యక్తులను కాదు మనసులను ఆలింగనం చేసుకోవడం ఆలయ్  బలయ్ ఉద్దేశ్యమన్నారు. రాక్షసులపై  దేవతలు సాధించిన  తర్వాత  దసరా పండుగను  నిర్వహించుకుంటామని దత్తాత్రేయ పురాణాలను ప్రస్తావించారు. 

రెండు  తెలుగురాష్ట్రాలు శాంతి,సౌభాగ్యాలతో  వర్ధిల్లాలన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు  సమస్యలు,సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.రెండు తెలుగు రాష్ట్రాలు సీఎంలు,ప్రజలు కలిసి సమైక్యంగా కృషిచేస్తే  దేశంలోనే అగ్రగామిగా నిలుస్తాయన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుసమృద్ది రాష్ట్రాలుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

also read:ప్రేమను పంచే సంస్కృతిని కొనసాగించాలి: అలయ్ బలయ్ లో డోలు కొట్టి చిందేసిన చిరంజీవి

 తెలంగాణ ఏర్పాటైన తర్వాత నిర్వహించిన అలయ్  బలయ్ కార్యక్రమానికి  అప్పటి సీఎం చంద్రబాబు,తెలంగాణ సీఎంలు కేసీఆర్ లను ఆహ్వనించినట్టుగా దత్తాత్రేయ గుర్తు చేశారు. ఇవాళ కార్యక్రమానికి కూడ ఏపీ సీఎం జగన్,తెలంగాణ సీఎం  కేసీఆర్ లను కూడా ఆహ్వానించామన్నారు. కానీ కొన్ని కారణాలతో ఇద్దరు సీఎంలు  ఈ కార్యక్రమానికి రాలేదని దత్తాత్రేయ చెప్పారు. 

ఈ  కార్యక్రమంలో  కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ , మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, పలు పార్టీల నేతలు,పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అలయ్ బలయ్ లో కళా ప్రదర్శనలు నిర్వహించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios