బ్యాంకు సిబ్బంది,  మధ్య వర్తులు  కుమ్మక్కై  కాజేసిన నిధులను  అకాడమీకి వెనక్కి ఇస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. 


హైదరాబాద్ : స్వాహా అయిన telugu akademi నిధులు రూ. 65 కోట్లను ఆయా బ్యాంకులు తిరిగి ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇటీవల పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీ దేవసేన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) కెనరా బ్యాంకు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది, మధ్య వర్తులు కుమ్మక్కై కాజేసిన నిధులను అకాడమీకి వెనక్కి ఇస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. 

అకాడమీ నిధులు వివిధ బ్యాంకులకు చెందిన 31 శాఖల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. ఇకపై వాటినన్నింటినీ లీడ్ బ్యాంక్ అయిన State Bank of India లోనే ఉంచనున్నారు.

రాష్ట్ర విభజన నాటి నుంచి తెలుగు అకాడమీకి సంబంధించిన నిధుల వినియోగంపై సాగుతున్న ముగిశాక ఆర్థిక శాఖ నుంచి మార్గదర్శకాలు విడుదల అని అధికార వర్గాలు తెలిపాయి. 

తెలుగు అకాడమీ స్కాం: మరో అరెస్ట్, ఎఫ్‌డీలు కొట్టేద్దామన్న స్కెచ్ ఇతనిదే.. చిన్న సలహాతో రూ.2.50 కోట్లు కమీషన్

ఇదిలా ఉండగా... తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ వ్యవహారంలో శిరిడీ కి చెందిన మదన్ ను నగర్ సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్ 23, గురువారం రాత్రి అరెస్టు చేశారు. కేసులో నిందితురాలు, కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధన భర్త బాబ్జీకి 41వ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. తాజాగా అరెస్టయిన మదన్ కీలక నిందితుడు సాయి కుమార్ కు ప్రాణస్నేహితుడు. 

మదన్ ద్వారానే విశాఖపట్నానికి చెందిన సాంబశివరావు తో సంప్రదింపులు జరిపారు. మధ్యవర్తిత్వం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మీరు ఎప్పుడూ షిరిడి వెళ్లిన అక్కడ అవసరమైన సౌకర్యాలు కల్పించే వాడు. ముగ్గురు కలిసి రూ.64.05 కోట్ల విలువైన Fixed Deposits కొట్టేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు.

గతేడాది డిసెంబర్ లోనే Telugu Akademi సొమ్ము కాజేసేందుకు తెలివిగా వ్యూహరచన చేశారు. ఆ తర్వాత తమకు అనుకూలమైన వ్యక్తుల సహకారంతో వ్యవహారం నడిపించారు. కోట్లాది రూపాయలు చేతికి అందగానే వాటాలు పంచుకున్నారు. ఆ తర్వాత భారీగా Assets కూడబెట్టారు.

కేసును సవాల్ గా తీసుకున్న సిసిఎస్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. రూ.64.05 కోట్లలో ఇప్పటివరకు రూ. 20 కోట్లు స్వాధీనం చేసుకుని 17 మందిని అరెస్టు చేశారు. ఇకనుంచి accusedకు సహకరించిన కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది.

సిసిఎస్ పోలీసులు మాత్రం కేసుతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరిని వదలమని స్పష్టం చేస్తున్నారు. AP, Telanganaకు చెందిన మరి కొందరిని అరెస్టు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలకమైన ఆధారాలు రాబట్టేందుకు Sambhasivarao కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

Telugu Akademi Fixed Deposits గోల్ మాల్ కేసులో సిసిఎస్ పోలీసులు రూ. 20 కోట్లు తిరిగి రాబట్టారు. ఇందులో రూ. మూడు కోట్ల నగదు, రూ. 16 కోట్ల విలువైన స్తిర, చరాస్తులు ఉన్నాయి. ఆస్తిపాస్తుల క్రయ విక్రయాలు జరగకుండా ఏపీ, తెలంగాణ స్టాంపులు/ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు.