Asianet News TeluguAsianet News Telugu

తెలుగు అకాడమీ స్కాం: మరో అరెస్ట్, ఎఫ్‌డీలు కొట్టేద్దామన్న స్కెచ్ ఇతనిదే.. చిన్న సలహాతో రూ.2.50 కోట్లు కమీషన్

రెండు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కేసులో (telugu akademi scam) కృష్ణారెడ్డిని (krishna reddy) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్ట్‌ల సంఖ్య 16కి చేరుకుంది.  బ్యాంక్ నుంచి డబ్బులు కొల్లగొట్టాలని కృష్ణారెడ్డి ప్లాన్ గీశాడు. 

krishna reddy arrested in telugu akademi scam
Author
Hyderabad, First Published Oct 19, 2021, 5:14 PM IST

రెండు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కేసులో (telugu akademi scam) కృష్ణారెడ్డిని (krishna reddy) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్ట్‌ల సంఖ్య 16కి చేరుకుంది.  బ్యాంక్ నుంచి డబ్బులు కొల్లగొట్టాలని కృష్ణారెడ్డి ప్లాన్ గీశాడు. సాయికుమార్‌కు సలహా ఇచ్చి రూ.2.50 కోట్లను కమీషన్‌గా తీసుకున్నాడు కృష్ణారెడ్డి. దీంతో వీరిద్దరూ కలిసి ప్రభుత్వ శాఖల ఫిక్స్‌డ్ డిపాజిట్లు కాజేసేందుకు కుట్రపన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కృష్ణారెడ్డి కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు ఎట్లకేలకు సోమవారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. 

కాగా.. ఈ కేసులో మరో సూత్రధారిని పోలీసులు అక్టోబర్ 14న అదుపులోకి తీసుకున్నారు. సాంబశివరావు (sambasivarao) అనే వ్యక్తిని గుంటూరులో (guntur) పట్టుకున్నారు. బ్యాంక్ మేనేజర్లకు సాయికుమార్‌ను పరిచయం చేసింది ఈ సాంబశివరావేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. మేనేజర్లను పరిచయం చేసినందుకు గాను కమీషన్ వసూలు చేశాడు. ఈ క్రమంలోనే మస్తాన్‌వలీ, సాధనను పరిచయం చేసినందుకు గాను రూ.60 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే సాయికుమార్, బ్యాంక్ మేనేజర్లు వైజాగ్‌లో మీటింగ్‌లు పెట్టుకున్నారు. తాజాగా సాంబశివరావును గుంటూరు నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు సీసీఎస్ పోలీసులు.

ALso Read:ఏపీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కామ్: ప్రభుత్వానికి గల్లంతైన సొమ్ము వెనక్కిచ్చిన ఐవోబీ.. ఎంతంటే..?

మరోవైపు తెలుగు అకాడమీ స్కాంలో కీలక పాత్ర పోషించిన సాయికుమార్ ఏపీలోని రెండు ప్రభుత్వ సంస్థల నుంచి కూడా (sai kumar gang) డబ్బులు కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ (ap warehousing corporation) నుంచి రూ.10 కోట్లు కొట్టేశాడు సాయికుమార్. ఆలాగే ఏపీ సీడ్స్ కార్పోరేషన్ (ap seeds corporation) నుంచి ఐదు కోట్ల ఎఫ్‌డీలను కూడా డ్రా చేశాడని పోలీసులు తెలిపారు.

ఇకపోతే .. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రభుత్వ శాఖలకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల గల్లంతు కుంభకోణంలో నిధులను అక్టోబర్ 15న ప్రభుత్వానికి వెనక్కిచ్చింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) (indian overseas bank). ఈ బ్యాంక్ బ్రాంచ్‌లోని గిడ్డంకుల శాఖకు చెందిన ఎఫ్‌డీల నుంచి రూ.9.6 కోట్లను కేటుగాళ్లు కొట్టేశారు. దీనిపై ఐవోబీ యాజమాన్యం స్పందించింది. దీంతో గిడ్డంకుల శాఖ అకౌంట్‌లో రూ.9.6 కోట్లను బ్యాంక్ డిపాజిట్ చేసింది. వడ్డీ డబ్బులు కూడా ఎఫ్‌డీల మెచ్యూర్ అయ్యేనాటికి ఇస్తామని ఐవోబీ తెలిపింది. బ్యాంక్ సిబ్బంది సహకారంతో స్కామ్ జరిగినట్లు నిర్థారణ అయ్యింది. దీనిపై గిడ్డంకుల శాఖ ఎండీ స్పందించారు. అమౌంట్ అంతా వెనక్కి వచ్చిందని ఆయన తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios