భారతదేశం ఆధునీకరణ, అభివృద్ది వైపు అడుగులేస్తోంది. దీంతో దేశంలోని మాతృభాషలన్నీ మరుగున పడుతూ ఇంగ్లీష్ భాష పెత్తనం పెరిగిపోతోంది. కార్పోరేట్ విద్యా విధానం, ఇంగ్లీష్ పై మోజుతో నేటి సమాజం మాతృ భాషనే మరిచిపోయే పరిస్థితి వచ్చింది.  ఇలాంటి సమయంలో కూడా కొన్ని సంస్థలు తమ తల్లిభాషను బ్రతికించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అలా తెలుగు భాషను గత 50 ఏళ్లుగా బ్రతికిస్తూ అలుపెరగకుండా శ్రమిస్తోంది తెలుగు అకాడమీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో భాషా, సాహిత్యాలకు సేవలు చేస్తూ తెలుగు అకాడమీ స్వర్ణోత్సవంలోకి అడుగుపెట్టింది.

ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా తెలుగు అకాడమీ గత కొన్ని రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గత శుక్రవారం తెలుగు బాషా మరియు సాహిత్య కృషి అనే అంశంపై వక్తలతో ప్రసంగాలను ఏర్పాటు చేశారు. ఇందులో తెలుగు సాహిత్యకారులు, బాషాభిమానులు పాల్గొన్ని ప్రసంగించారు.

ఈ కార్యక్రమాన్ని తెలుగు అకాడమీకి చెందిన శ్రీవిద్య నిర్వహించారు. ఇందులో బర్నె ఐలయ్య, కాశీం, నిత్యానందరావు, తెన్నేటి సుధ వంటి ప్రముఖులు పాల్గొని తమ ప్రసంగాలతో సభికులను ఆకట్టుకున్నారు. ఆ వీడియోలు ఏషియా నెట్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

వీడియో 

"