Asianet News TeluguAsianet News Telugu

"గుడ్డిలో మెల్ల" అంటూ కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం చురకలు

బడ్జెట్  ప్రసంగం చదివింది తమిళిసై అయినప్పటికీ... ఆ ప్రసంగాన్ని తాయారు చేసింది మాత్రం రాష్ట్రప్రభుత్వం అనేది మరువ కూడదు. ఇక్కడ ఈ ప్రసంగంలో కేంద్రప్రభుత్వంపై మరోసారి తుపాకీ ఎక్కుపెట్టాడు కెసిఆర్. 

Telangna budget 2020: Kcr mocks central government by using the phrase blink in the blind
Author
Hyderabad, First Published Mar 6, 2020, 2:50 PM IST

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి ఉదయం నుండి ప్రారంభమైన విషయాలు తెలిసిందే. ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నేటి ఉదయం ఇరు సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఈ ప్రసంగం ఆద్యంతం చాలా ఆసక్తిగా సాగింది. 

బడ్జెట్  ప్రసంగం చదివింది తమిళిసై అయినప్పటికీ... ఆ ప్రసంగాన్ని తాయారు చేసింది మాత్రం రాష్ట్రప్రభుత్వం అనేది మరువ కూడదు. ఇక్కడ ఈ ప్రసంగంలో కేంద్రప్రభుత్వంపై మరోసారి తుపాకీ ఎక్కుపెట్టాడు కెసిఆర్. 

దేశంలో నెలకొన్న ఆర్ధిక మందగమనం తెలంగాణను కూడా తాకిందని, ఆ ఆర్ధిక మందగమనానికి తెలంగాణ ఏం అతీతం కాదని ఆ ప్రసంగంలో పొందుపరిచారు. దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ పరిస్థితి నయం అని గవర్నర్ అన్నారు. 

గుడ్డిలో మెల్ల... 

తెలంగాణ ఆర్ధిక పరిస్థితిని ఇతర రాష్ట్రాల పరిస్థితో సరిపోల్చి చూస్తే... గుడ్డిలో మెల్లలాగా ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. మిగిలిన రాష్ట్రాలు రుణాత్మక వృద్ధి రేటును నమోదు చేస్తుంటే... తెలంగాణ మాత్రం ఇంకా ఆర్థికంగా వృద్ధి రేటు తగ్గినప్పటికీ, గుణాత్మకంగానే సాగుతుందని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అది ఆనందదాయకమైన విషయం అని ఆమె అన్నారు. 

ఇకపోతే... ఈ ప్రసంగంలో ఆమె పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని  చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగుతోందని గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. బీడి కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 2016 పెన్షన్ అందిస్తున్న విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. 

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ సంక్షోభాన్ని చవిచూసినట్టు చెప్పారు. ఆసరా పెన్షన్లు పేదల జీవితాల్లో  వెలుగులు నింపినట్టుగా ఆమె చెప్పారు.రాష్ట్రం కోసం ఉద్యమించిన నేత రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని గవర్నర్ చెప్పారు.కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రం పురోభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారామె. 

Also read:తెలంగాణ బడ్జెట్ సమావేశాలు లైవ్ అప్ డేట్స్:రాష్ట్రం కోసం ఉద్యమించిన నేతే పాలిస్తున్నాడు: గవర్నర్
వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నామని తమిళిసై చెప్పారు. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు భీమా పథకాన్ని అమలు చేస్తున్నట్టు గవర్నర్ చెప్పారు. 

ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.  తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం దండగ అనే పరిస్థితులు ఉండేవి కానీ, ప్రస్తుతం వ్యవసాయం పండగ అనే పరిస్థితులు నెలకొన్నాయని ఆమె చెప్పారు. 

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించామన్నారు. అతి తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్టు చెప్పారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. 

కళ్యాణ్‌లక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి స్కీమ్‌ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో వెలుగులు నిండాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి ప్రాణాలు ఆర్పించిన  కుటుంబాలు రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం అందించినట్టుగా తమిళిసై చెప్పారు.

బీసీ వర్గాల కార్యాలయాల కోసం హైద్రాబాద్‌లో స్థలాన్ని కేటాయించినట్టుగా ఆమె చెప్పారు.  విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. కొత్త పంచాయితీరాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చినట్టుగా ఆమె గుర్తు చేశారు. వేగంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్టుగా గవర్నర్  చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios