Asianet News TeluguAsianet News Telugu

ఆస్తి పంచాలంటూ... 79 యేళ్ల మామ ఫోన్ పై కోడలు నిఘా.. రహస్యంగా కాల్ రికార్డ్స్ వింటూ.. !

ఈ దర్యాప్తులో వారికి ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది. సదరు కోడలు ఆ వ్యక్తి ఫోన్‌లో కాల్ రికార్డింగ్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి దాని రికార్డింగ్స్ తన ఇమెయిల్‌కి వచ్చేలా లింక్ చేసినట్లు గుర్తించారు. 

Telangana : Woman installs app on father-in-laws mobile to spy over asset row, caught
Author
Hyderabad, First Published Oct 20, 2021, 10:19 AM IST

హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులకు ఓ విచిత్రమైన కేసు తగిలింది. ఓ 79 ఏళ్ల వ్యక్తి తన కోడలు తనపై నిఘా పెట్టిందంటూ సైబర్ క్రైమ్ బృందాన్ని ఆశ్రయించాడు. మొదట్లో అతని వాదనపై సందేహం వ్యక్తం చేసిన పోలీసులు ఆ తరువాత దర్యాప్తు మొదలుపెట్టారు. 

ఈ దర్యాప్తులో వారికి ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది. సదరు కోడలు ఆ వ్యక్తి ఫోన్‌లో కాల్ రికార్డింగ్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి దాని రికార్డింగ్స్ తన ఇమెయిల్‌కి వచ్చేలా లింక్ చేసినట్లు గుర్తించారు. దీంతో అతని ఫోన్ లో రికార్డైన కాల్స్ అన్నీ ఆమె మెయిల్ కు వస్తున్నాయి. 

తన phone లో ఇలా జరగుతుందని అతనికి అనుమానం వచ్చి.. పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు వైకుంఠం కరీంనగర్‌కు చెందిన bussinessman. అతనికి నలుగురు కుమారులు ఉన్నారు. కాగా, అతను తన తన భార్యతో కలిసి రెండవ కుమారుడు (45) కుటుంబంతో కరీంనగర్‌లో ఉంటున్నాడు.

గత కొన్నేళ్లుగా, అతని రెండవ కోడలు (40) property distribute చేయాలని పట్టుబడుతోందని, ఆస్తిపంపకాలు చేస్తే తను, తన భర్త విడిగా ఉండొచ్చని గొడవ చేస్తుందని వైకుంఠం తెలిపాడు. అయితే, ఆస్తిని విభజించడానికి వైకుంఠం, అతని భార్య అంగీకరించలేదు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం వైకుంఠం రెండో కోడలు తను పర్సనల్ గా మాట్లాడిన మాటలను ఇతర కుటుంబసభ్యులతో సంభాషిస్తూ ఎద్దేవా చేయడం గమనించాడు. దీంతో తను ఫోన్ లో మాట్లాడేది ఆమె వింటుందని అతనికి అర్థం అయ్యింది. దీంతో కోడలిని అనుమానించినట్లు సైబర్ క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కెవిఎం ప్రసాద్ తెలిపారు.

పోలీసుల ప్రతాపం.. తలనీలాలివ్వడానికి యాదాద్రికి వెళ్లిన దివ్యాంగుడి మృతి...

కొన్ని నెలల క్రితం, వైకుంఠం, అతని భార్య బేగంపేటలోని వారి పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లారు. అయితే, వెళ్లే ముందు అతను కొన్ని విలువైన వస్తువులను అల్మీరాలో ఉంచి, తన కుమారుడితో చర్చించిన తర్వాత వాటి తాళాలను ఇంట్లో దాచిపెట్టాడు. “ఇటీవల, వైకుంఠం అతని భార్య కరీంనగర్‌కు తిరిగి వచ్చి అల్మీరాను తెరిచినప్పుడు, కొన్ని విలువైన వస్తువులు లేవని వారు గ్రహించారు. వారు హైదరాబాద్‌లోని తమ కొడుకుకు అదే విషయాన్ని తెలియజేశారు. అయితే ఏం పోయాయో చెప్పకుండా కేసు నమోదు చేశారు. దీంతో వైకుంఠం ఫోన్ ను వెరిఫై చేసినప్పుడు, బాధితురాలి రెండవ కోడలు ఇమెయిల్‌తో లింక్ చేయబడిన కాల్ రికార్డర్ ఫోన్‌లో కనిపించింది ”అని ACP అన్నారు.

"అతని అనుమతి లేకుండా, అతని కోడలు, కుమారుడు తన ఫోన్‌లో యాప్‌ని ఇన్‌స్టాల్ చేశారని ఆరోపిస్తూ, ఫిర్యాదుదారు మాకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు" అని ప్రసాద్ చెప్పారు.ఐటీ చట్టంలోని సెక్షన్ 43 r/w 66, 66-C కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios