Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల ప్రతాపం.. తలనీలాలివ్వడానికి యాదాద్రికి వెళ్లిన దివ్యాంగుడి మృతి...

‘మామూలుగా చనిపోయాడని అనుకున్నాను. కాల్ రికార్డు విన్నాక Yadadri సెక్యూరిటీ పోలీసులు కొట్టిన దెబ్బలు మరణానికి కారణమని అనుమానిస్తున్నాం’  అని తెలిపారు.  మహబూబ్నగర్  శ్రీనివాస కాలనీకి చెందిన కార్తీక్  గౌడ్  (32)  దివ్యాంగుడు.  ఎడమ కాలికి పుట్టుకతోనే అవస్థ ఉంది.  Forest Department పరిధిలోని మయూరి నర్సరీ లో  తాత్కాలిక పద్ధతిపై టికెట్ కౌంటర్ లో  నాలుగేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు.

handicapped person dead in yadadri
Author
Hyderabad, First Published Oct 20, 2021, 7:32 AM IST

యాదగిరిగుట్ట :  కుమార్తె పుట్టిందని తలనీలాలను సమర్పించడానికి యాదాద్రి క్షేత్రానికి వెళ్ళిన దివ్యాంగుడు మరుసటి రోజు ఛాతి, కడుపులో నొప్పి అంటూ ఆసుపత్రిలో చేరి హైదరాబాదులో మృతిచెందాడు.  పుణ్యక్షేత్రం వద్ద Security personnels కొట్టిన దెబ్బల వల్లే తన కుమారుడు మృతి చెందినట్లు తండ్రి నారాయణ గౌడ్ మంగళవారం మహబూబ్నగర్ రూరల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

‘మామూలుగా చనిపోయాడని అనుకున్నాను. కాల్ రికార్డు విన్నాక Yadadri సెక్యూరిటీ పోలీసులు కొట్టిన దెబ్బలు మరణానికి కారణమని అనుమానిస్తున్నాం’  అని తెలిపారు.  మహబూబ్నగర్  శ్రీనివాస కాలనీకి చెందిన కార్తీక్  గౌడ్  (32)  దివ్యాంగుడు.  ఎడమ కాలికి పుట్టుకతోనే అవస్థ ఉంది.  Forest Department పరిధిలోని మయూరి నర్సరీ లో  తాత్కాలిక పద్ధతిపై టికెట్ కౌంటర్ లో  నాలుగేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు.

15 రోజుల క్రితం ఆయన భార్య తొలి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. మొక్కు ఉండడంతో ఆదివారం సాయంత్రం ఆయన ఒక్కడే యాదాద్రి కి వెళ్ళాడు. వెళ్లేసరికి అర్థరాత్రి అయింది. గదుల కోసం మొదటి Ghat Road వద్ద తిరుగుతుండగా  భద్రతాసిబ్బంది కొడుతున్నారని జడ్చర్ల లోని తన బంధువు ఒకరికి ఫోన్ చేసి తెలిపాడు.

హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేత రాజకీయ కుట్ర: మంత్రి కొప్పుల ఈశ్వర్

 సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తా
రికార్డ్ అయిన సంభాషణల ప్రకారం…‘ మామూలుగా వెళుతున్న నన్ను పిలిచి కొట్టారు.  నేను handicaped ని పరిగెత్త లేను అన్నా వినలేదు. అటవీ శాఖలో పని చేస్తున్నానని ఆధారం చూపించగా ‘ మాకు చూపిస్తావా’ అని కర్రలతో ఇంకా కొట్టారు. వారి పక్కనే alcohol Bottles ఉన్నాయి. కొట్టడానికి వారికి హక్కు ఎవరిచ్చారు? సీఎం KCR కు ఫిర్యాదు చేస్తా.’’  అని కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ సంభాషణ విని వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ‘ సమాచారం తెలిసి గొడవ జరుగుతున్నప్పుడే అక్కడికి వెళ్లాం.  వాగ్వాదాని ఆపి అక్కడి నుంచి కార్తీక్  ను పంపించి వేశాం’ Yadagirigutta పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ  రామకృష్ణారెడ్డి తెలిపారు.

బస్టాండ్లో ఛాతిలో నొప్పి తో విలవిల
సోమవారం ఉదయం పదిన్నర గంటలకు హైదరాబాద్ బస్టాండ్ నుంచి బంధువులకు ఫోన్ చేసిన కార్తీక్... తలనీలాలు సమర్పించి తిరిగి ఇంటికి బయలు దేరాను అని,  కడుపు,  ఛాతిలో నొప్పి వస్తుంది అని చెప్పాడు.  వారి సూచనతో ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడ 12 గంటల  యాభై నిమిషాలకు మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్నగర్ గ్రామీణ ఎస్సై రమేష్ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios