Asianet News TeluguAsianet News Telugu

మరో మూడురోజులూ... ఆ జిల్లాల్లో భారీ వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

telangana wether report... heavy rains in next three days
Author
Hyderabad, First Published Sep 17, 2020, 10:29 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్​నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట జిల్లాలలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.

రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలో దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా సెప్టెంబర్ 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. 

read more   హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం... తడిసి ముద్దవుతున్న నగరం

తెలంగాణతో పాటు దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్​గఢ్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం(సెప్టెంబరు 16 వ తేదీన) ఉదయం బలహీనపడిందన్నారు. దీనికి అనుబంధముగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ దాని పరిసర ప్రాంతాలలో 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో మూడురోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని... ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios