Asianet News TeluguAsianet News Telugu

ముషంపల్లి ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్.. జగదీష్ రెడ్డి ఘెరావ్..

సైదాబాద్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య జరిగిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడంతో ప్రతిపక్ష పార్టీలు పోలీసులపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.

Telangana : Two accused in rape and murder of woman arrested, minister faces protest
Author
Hyderabad, First Published Sep 24, 2021, 9:29 AM IST

హైదరాబాద్ : ముషంపల్లి(Mushampally)లో బుధవారం 54 ఏళ్ల మహిళపై అత్యాచారం, హత్య(Rape and Murder)కు నిరసనగా నల్గొండ జిల్లాలో కొందరు మహిళలు మంత్రి జి జగదీష్ రెడ్డి(G Jagadish Reddy)ని గురువారం ఘెరావ్ చేశారు. 

సైదాబాద్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య జరిగిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడంతో ప్రతిపక్ష పార్టీలు పోలీసులపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.

డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (నల్గొండ) ఎవి రంగనాథ్ మాట్లాడుతూ, ఈ నేరానికి పాల్పడిన దాదాపు 40 ఏళ్ల వయస్సు గల ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని చెప్పారు.

బుధవారం, బాధితురాలు కిరాణా దుకాణానికి వెళుతుండగా, దారిలో ఆమె ప్రధాన నిందితుడి ఇంటి దగ్గర పువ్వులు తెంపడానికి వెళ్లింది. అదే అదనుగా భావించిన నిందితులు.. ఆమెను ముఖ్య నిందితుడి ఇంట్లోకి లాక్కెళ్లారు. వాళ్లు అప్పటికే తాగి ఉన్నారు. ముఖ్య నిందితుడు బాధితురాలిపై అత్యాచారం చేశాడు, ఈ సమయంలో ఇతర నిందితులు బయట నిలబడ్డారు" అని డిఐజి చెప్పారు. విషయం బైటికి రాకుండా ఉండాలని.. ఆ తరువాత ఆమె తలను నేలకోసి కొట్టి చంపాడు.

తరువాత, ఆమె మృతదేహాన్ని నిందితుడి ఇంట్లోనుంచి వరండాలోకి లాగడానికి మిగితా నిందితులు సాయం చేశారు. ఆ తరువాత సహ నిందితుడు బాధితురాలి బంధువు వద్దకు వెళ్లి ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. 
దీంతో "ఆ బంధువు మొదట బాధితురాలి నివాసానికి వెళ్లాడు, అక్కడ ఆమె కనిపించలేదు. 

తరువాత తనకు సమాచారం ఇచ్చిన నిందితుడిని వెతకడానికి, అతను ముఖ్య నిందితుడి నివాసానికి వెళ్లినప్పుడు ఆమె మృతదేహం వరండాలో కనిపించింది. వెంటనే అతను స్థానికులను అప్రమత్తం చేయడంతో, వారు నిందితులిద్దరినీ పట్టుకున్నారు. బాగా తాగి ఉన్న వారిద్దరినీ పోలీసులకు అప్పగించారు "అని అధికారులు తెలిపారు.

ముషంపల్లి ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ.. మంత్రి జగదీష్ రెడ్డి

ఈ నేరానికి పాల్పడిన నిందితులిద్దరినీ భార్యలు విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. "ప్రధాన నిందితుడి భార్య నెల క్రిందట అతన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. అప్పటినుంచి అతను నిరంతరం తాగుతూనే ఉన్నాడు’’ అని పోలీసులు చెప్పారు.

గురువారం, జగదీశ్ రెడ్డి జిల్లాకు ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు, పెద్ద సంఖ్యలో మహిళలు నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఆందోళనకారులను నియంత్రించడానికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

అయితే, అంతకుముందు నెలక్రితమే.. ఓ స్థానిక మహిళను వేధించాడని మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడి భార్య ఇక ముందు తన భర్త అలాంటి తప్పు చేయడని, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఆ మహిళను కోరడంతో ఆమె ఫిర్యాదు ఉపసంహరించుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios